కన్నడ భామ రుక్మిణి వసంత్ పేరుని ఇప్పుడు గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. కారణం ఈభామ క్రేజీగా పాన్ ఇండియా హీరోలతో నటిస్తూ పాపులర్ అవడమే కాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన డ్రాగన్(వర్కింగ్ టైటిల్) లో నటించడంతో రుక్మిణి వసంత్ పేరు మార్మోగిపోతోంది.
రీసెంట్ గా మదరాసి రిజల్ట్ తో డిజప్పాయింట్ అయిన రుక్మిణి వసంత్ మరో పదిహేను రోజుల్లో కాంతార చాప్టర్ 1 తో హడావిడి చెయ్యడానికి రెడీ అవుతుంది. ప్రస్తుతం కాంతార 1 ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రుక్మిణి వసంత్ త్వరలోనే ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ సెట్ లోకి వెళ్లనుంది. ఇప్పటికే ఆమె ఎన్టీఆర్ డ్రాగన్ షూట్ లో జాయిన్ అయ్యింది.
కాంతార చాప్టర్ 1 ప్రమోషన్స్ తో రుక్మిణి వసంత్ సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తుంది. ఇక కాంతార తర్వాత డ్రాగన్ అలాగే ఈ చిత్రంతో పాటుగా అమ్మడు యష్ టాక్సిక్ లోను నటిస్తూ ఇప్పుడు క్రేజీగా మారిపోయింది.