తెలంగాణలో OG కి స్పెషల్ ప్రీమియర్స్

Fri 19th Sep 2025 09:45 PM
og  తెలంగాణలో OG కి స్పెషల్ ప్రీమియర్స్
OG Special Premieres in Telangana తెలంగాణలో OG కి స్పెషల్ ప్రీమియర్స్
Advertisement
Ads by CJ

ఏపీలో పవన్ కళ్యాణ్ నటించిన OG చిత్రానికి 1000 రూపాయల టికెట్ ప్రైస్ కి ప్రభుత్వం అనుమతినిచ్చింది, కాకపోతే 25  తెల్లవారుఝాము1 గంట షో కి మాత్రమే అనుమతులు వచ్చాయి. అంతేకాకుండా సింగిల్ స్క్రీన్స్, మల్టిప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని పదిరోజుల పాటు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. మరి ఏపీలో OG కి బాగానే గిట్టుబాటు అయ్యింది. మరి తెలంగాణాలో అంటూ పవన్ ఫ్యాన్స్ దీర్ఘాలు తీస్తున్నారు. 

తెలంగాణ లోను OG కి బాగానే గిట్టుబాటు అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం OG స్పెషల్ ప్రీమియర్ షోస్ కు పర్మిషన్ ఇచ్చేసింది. అంటే సెప్టెంబర్ 24 నైట్ 9 గంటలకే OG షో పడిపోతుంది. ఈ ప్రీమియర్ షో కి టికెట్ రేట్ 800 రూపాయలు, అలాగే 10రోజుల పాటు టికెట్ రేట్స్ పెంపు కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 

సింగల్ స్క్రీన్ 100 రూపాయలు,  మల్టీఫ్లెక్స్ 150 రూపాయలు టికెట్ రేట్లు పెంచుకునేందుకు OG మేకర్స్ కి తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తూ జీవో జారి చేసేసింది. 

OG Special Premieres in Telangana:

OG: Paid Premieres Confirmed In Telangana

Tags:   OG
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ