నందమూరి బాలకృష్ణ-బోయపాటి కలయికలో క్రేజీ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం చిత్రం సెప్టెంబర్ 25 నుంచి పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. మరి సెప్టెంబర్ 25 నుంచి వాయిదా పడిన అఖండ 2 అఖండ సెంటిమెంట్ తో డిసెంబర్ లో విడుదల కావొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి.
కానీ ఇప్పుడు అఖండ 2 సంక్రాంతి బరిలోకి వెళుతుంది, ఈసారి అంటే 2026 సంక్రాంతి బాక్సాఫీసు మాములుగా ఉండదు.. ప్రభాస్ రాజా సాబ్, మెగాస్టార్ మన శివ శంకర వార ప్రసాద్ గారు తో అఖండ తాండవం పోటీ పడుతుంది అనే రూమర్స్ మొదలు కావడంతో నందమూరి అభిమానులు కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు.
డిసెంబర్ నుంచి అఖండ 2 స్కిప్ చెయ్యదు కదా అంటూ వారు మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ సంక్రాతి రిలీజ్ అయినా పర్లేదు, బాలయ్యకు కొన్నేళ్లుగా సంక్రాంతి సీజన్ కలిసొస్తుంది. కాకపోతే పోటీ ఎందుకు డిసెంబర్ అయితే బావుంటుంది అనేది వారి కోరిక.