Advertisementt

ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక నెరవేరేనా

Sat 30th Aug 2025 10:12 AM
prabhas marriage  ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక నెరవేరేనా
Will Prabhas fans dream come true ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక నెరవేరేనా
Advertisement
Ads by CJ

కోలీవుడ్ హీరో విశాల్ పెళ్లి పీటలెక్కుతున్నాడు. సాయి ధన్సికను విశాల్ నిన్న ఆగష్టు 29 న ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. విశాల్-సాయి ధన్సికలు ఎంగేజ్మెంట్ చేసుకున్న సందర్భంగా ఆ జంటకు శుభాకాంక్షలు తెలిపిన ప్రభాస్ ఫ్యాన్స్ త్వరలోనే ప్రభాస్ కూడా గుడ్ న్యూస్ చెప్పాలని కోరుకుంటున్నారు.

ప్రభాస్ నాలుగు పదుల వయసులో ఇంకా పెళ్లి చేసుకోకుండా మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకుగా టాలీవుడ్ లో కనిపిస్తున్నాడు. ఆయన అభిమానులు ప్రభాస్ ఓ ఇంటివాడు ఎప్పుడు అవుతాడా అని ఎదురు చూడని క్షణం లేదు. ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి కూడా పలు దేవాలయాల్లో ప్రభాస్ పెళ్లి కోసం ప్రత్యేకంగా పూజలు అవి చేయిస్తున్నారు.

ఈ ఏడాది ప్రభాస్ పెళ్లి, ఆ ఏడాది ప్రభాస్ పెళ్లి అనడమే కానీ ప్రభాస్ మాత్రం ఆ గుడ్ న్యూస్ చెప్పకుండా అభిమానులకు ఆనందాన్ని దూరం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్నారు. రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్2 అంటూ ప్రభాస్ వచ్చే ఐదారేళ్ళు బిజినే. 

Will Prabhas fans dream come true:

  Prabhas Marriage Become Hot topic Again  

Tags:   PRABHAS MARRIAGE
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ