నిజమే నారా రోహిత్ కొన్నాళ్లపాటు సినిమాలకు బిగ్ బ్రేకిచ్చాడు. మధ్య మధ్యలో ఫ్రెండ్స్ నటించిన సినిమాల ఈవెంట్స్ లో కనిపించాడే తప్ప హీరోగా సినిమాలు చెయ్యడం ఎందుకో తగ్గించాడు, ఇక నారా రోహిత్ సినిమాలు చెయ్యడు, రాజకీయాల్లోకి వెళ్ళిపోతాడు అనుకున్న సమయంలో సైలెంట్ గా ప్రతినిధి 2 తో వచ్చాడు.
ఆ తర్వాత భైరవం అంటూ బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ లతో కలిసి మే లో ప్రేక్షకులను పలకరించిన నారా రోహిత్ తాజాగా సుందరకాండ తో ఎలాంటి అంచనాలు లేకుండా ప్రమోషన్స్ చేసుకుంటూ వినాయకచవితికి ఆడియన్స్ లోకి వచ్చాడు. సినిమాలకు కొన్నేళ్లు గ్యాపిచ్చినా ఇప్పుడు సుందరకాండతో నారా రోహిత్ గట్టిగానే హిట్ కొట్టాడు.
ఆడియన్స్ నోటి నుంచే కాదు క్రిటిక్స్ రివ్యూస్ కూడా సుందరకాండ సినిమా బావుంది అనే మాట వినిపించడం నారా రోహిత్ కి ప్లస్ అయ్యింది. సుందరకాండ లాంటి మంచి సినిమాతో కమ్ బ్యాక్ అయిన నారా రోహిత్ రాజకీయాలపై అంతగా స్పష్టత ఇవ్వలేదు. ఇక నారా రోహిత్ ఆక్టోబర్లో తాను ప్రేమించిన నటి సిరి లెల్ల ను వివాహమాడానున్నాడు. అటు పర్సనల్ లైఫ్, ఇటు కెరీర్ లోను నారా రోహిత్ ఇకపై సెట్ అయినట్లే.