Advertisementt

ర‌త‌న్ టాటా ఆలోచ‌న‌ల‌తో నిత్యామీన‌న్

Fri 29th Aug 2025 04:58 PM
nithya menen  ర‌త‌న్ టాటా ఆలోచ‌న‌ల‌తో నిత్యామీన‌న్
Ratan tata is inspiration for Nithya Menen Not Getting Married ర‌త‌న్ టాటా ఆలోచ‌న‌ల‌తో నిత్యామీన‌న్
Advertisement
Ads by CJ

ఇండ‌స్ట్రీలో పెళ్లికాని వారు చాలా మంది ఉన్నారు.  వాళ్ల‌ని పెళ్లి ఎందుకు చేసుకోలేదు? అంటే ఎవ‌రి కారణాలు..వారు ఎవ‌రి అభిప్రాయాలు వారు పంచుకుంటారు. కొంత మందికి వివాహ జీవితంపై ఆస‌క్తి లేక‌న‌మ్మ‌కం లేక ముందుకురారు.  ఒంట‌రిగా  ఉంటేనే స్వేచ్ఛ‌గా ఉంటుంద‌ని...ఇదే అస‌లైన జీవితంగా భావించేవారు చాలా మంది. భార్య‌, పిల్ల‌లు అనే బంధం కంటే?  స్వేచ్ఛాయుత జీవితాన్నే కోరుకునే సెల బ్రిటీలు ఎక్కువ‌గా ఉన్నారు.  దివంగ‌త పారిశ్రామిక దిగ్గ‌జం ర‌త‌న్  టాటా కూడా వివాహం చేసుకోని సంగ‌తి తెలిసిందే.

 

తన త‌ల్లిదండ్రులు విడిపోవ‌డం...ప్రేమించిన ప్రియురాలు దూరం కావ‌డంతో ర‌త‌న్ టాటా వివాహ వ్య‌వ‌స్థ‌కు దూర‌మ‌య్యారు. త‌న జీవితంలోకి మ‌రో అమ్మాయికి ఛాన్స్ ఇవ్వ‌లేదు. పెళ్లి ఎందుకు చేసు కోలేదు? అంటే ఆ రెండు కార‌ణాలే ప్ర‌ధానంగా హైలైట్ చేసారు. కొన్నిసార్లు ఒంట‌రి జీవితం బోర్ కొట్టినా?  త‌న‌కంటూ ఓ ఫ్యామిలీ లేద‌ని పీలింగ్ అప్పుడ‌ప్పుడు వ‌చ్చినా?  ఎక్కువ‌గా లోన్లీగా ఉండ‌టానికే మ‌న‌సు ఒప్పుకునేద‌ని...స్వేచ్ఛ‌గా ఉండ‌ట‌మే ఉత్త‌మంగా భావించిన‌ట్లు తెలిపారు.

 

తాజాగా నిత్యామీన‌న్ కూడా ర‌త‌న్ టాటాలాంటి రీజ‌న్సే చెబుతుంది. అమ్మ‌డి వ‌య‌సు 37 ఏళ్లు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్ర‌స్తుతం తాను సింగిల్ జీవితాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నాన‌ని..ఒంట‌రిగా ఉండ‌ట‌మే మ‌న‌సు కోరుకుంటుంద‌ని తెలిపింది. పెళ్లి అనేది కేవ‌లం జీవితంలో ఓ భాగం మాత్ర‌మేన‌ని..చేసుకోవాలా?  లేదా? అన్న‌ది వారి ఇష్టాల‌ను బ‌ట్టి ఉంటుంద‌న్నారు. 

Ratan tata is inspiration for Nithya Menen Not Getting Married:

Why Nithya Menen Not Getting Married

Tags:   NITHYA MENEN
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ