Advertisementt

ఫోటో స్టోరి: 50 ప్ల‌స్ దేవ‌తా సుంద‌రి

Fri 29th Aug 2025 10:13 AM
malaika arora  ఫోటో స్టోరి: 50 ప్ల‌స్ దేవ‌తా సుంద‌రి
Malaika Arora the goddess of seduction at 50 ఫోటో స్టోరి: 50 ప్ల‌స్ దేవ‌తా సుంద‌రి
Advertisement
Ads by CJ

మోడ‌ల్ కం వీజే, డ్యాన్స‌ర్ కం న‌టిగా మ‌లైకా అరోరా బ‌ముముఖ పాత్ర‌ల‌ గురించి తెలిసిందే. ఇటీవ‌ల డ్యాన్స్ రియాలిటీ షోల జ‌డ్జిగాను అద్భుతంగా ఆర్జిస్తోంది. 50వ‌య‌సులోను త‌న‌దైన అందం, ఆక‌ర్ష‌ణ‌తో మ‌తులు చెడ‌గొడుతున్న మ‌లైకా, ఎఫైర్ వార్త‌ల‌తోను నిరంత‌రం చ‌ర్చ‌ల్లో నిలుస్తోంది. యువ‌హీరో అర్జున్ క‌పూర్ నుంచి విడిపోయిన మ‌లైకా ప్ర‌స్తుతం ఒంట‌రి. ఇటీవ‌ల పూర్తిగా త‌న కెరీర్ పైనే దృష్టి సారిస్తోంది.

 

తాజాగా మ‌లైకా హిందూస్తాన్ టైమ్స్ సిటీ షోస్టాపర్ మ్యాగజైన్ కోసం వైట్ ఆఫ్-షోల్డర్ డ్రెస్ లో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఈ డిజైన‌ర్ దుస్తుల్లో మ‌లైకా అంద‌చందాల‌కు మంత్ర‌ముగ్ధులు అయిపోతోంది యూత్. నేటి జెన్ జెడ్ సైతం మ‌లైకా దుస్తుల ఎంపిక‌కు స్పెల్ బౌండ్ అయిపోతోంది. మెడ‌లో ప‌చ్చ‌ని క్రిస్ట‌ల్ - వెండితో త‌యారు చేసిన నెక్లెస్ ఎంతో అందంగా మెరిసిపోతోంది. ముఖ్యంగా మ‌లైకా అంద‌చందాల‌ను ఎలివేట్ చేసే బోల్డ్ సెల‌క్ష‌న్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

 

న‌ట‌న ప‌రంగా చూస్తే, గత సంవత్సరం `మజ్జా యేక్ నంబర్` పాటలో కనిపించింది. ఇటీవ‌ల సినిమా అవ‌కాశాలు త‌గ్గాయి. త‌దుప‌రి రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానాతో కలిసి `థామా`లో న‌టిస్తోంది. త‌న‌దైన అద్భుత అందం గ్లామ‌ర్ షోతో ఇండ‌స్ట్రీలో త‌న మ‌నుగ‌డ‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ముందుకు సాగుతున్న మ‌లైకా ఔత్సాహిక న‌టీమ‌ణులంద‌రికీ స్ఫూర్తి.

Malaika Arora the goddess of seduction at 50 :

Age is just a number for Malaika arora

Tags:   MALAIKA ARORA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ