కమలినీ ముఖర్జీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. `ఆనంద్` తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు చాలా సినిమాలు చేసింది. నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. కన్నడ , మల యాళ చిత్రాల్లోనూ నటించింది. దాదాపు దశాబ్దం పాటు నటిగానే కొనసాగింది. అయితే పాత్రల పరంగా తనకంటూ కొన్ని పరిమితులు విధించుకునే పని చేసింది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంది. ఆ కారణంగా చాలా అవకాశాలు కోల్పోయింది. స్టార్ హీరోల్లో చిత్రాల్లో కీలక పాత్రల్లోనూ నటించింది.
కానీ సెకెండ్ ఇన్నింగ్స్ లో కూడా బిజీ కాలేదు. ఉన్నతంలో కెరీర్ ని ముందుకు తీసుకెళ్లింది తప్ప తప్ప ఆరాటం.. పోరాటాలతో అవకాశాలు దక్కించుకోలేదు. కాంపిటీషన్ వరల్డ్ లో కమలినీ పేరు పెద్దగా సంచల నమవ్వలేదు. పదేళ్లగా ఎలాంటి సినిమాలు చేయలేదు. ఇంటికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో రిటై ర్మెంట్ తీసుకోవడానికి గల అసలైన కారణాన్ని రివీల్ చేసింది. ఓ సినిమాలో పోషించిన పాత్ర తాను ఊహించిన స్థాయిలో లేదని , ఆ క్యారెక్టర్ పై అసంతృప్తి కలిగిందంది.
ఆ విషయంలో బాగా పీలైన తర్వాత సినిమాల చేయకూడదని నిర్ణయిం తీసుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత చాలా అవకాశాలు వచ్చినా తాను ముందుకు వెళ్లలేదని అనుకోకుండా మొదలైన ప్రయాణం చాలా కాలం పాటు సాగిందని సినిమాలకు అదే సరైన విరామ సమయం గా భావించి తప్పుకున్నట్లు తెలిపింది. 2004 లో `ఫిర్ మిలేంగే` అనే హిందీ సినిమాతో కమలినీ ప్రయాణం మొదలైంది. అదే ఏడాది తెలుగు సినిమా `ఆనంద్` లోనూ నటించింది. అటుపై `మీనాక్షి`, `స్టైల్ ` లో నటించింది.
అటుపై రెండేళ్ల అనంతరం `వెట్టైయాదు విల్లై యాదు` సినిమాతో కోలీవుడ్ లోనూ లాంచ్ అయింది. కానీ అక్కడా చాలా పరిమితంగానే తమిళ సినిమాలు చేసింది. 2010 లోనే కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ కెరీర్ ఆరంభించింది. అప్పటికే తెలుగు సినిమాలతో కాస్త బిజీగా ఉంది. అదే సమయంలో ఇతర భాషల అవకా శాలతోనూ నటిగా మరింత బిజీ అయింది. అప్పటి నుంచి 2016 వరకూ సినిమాలు చేసింది. చివరిగా మలయాళంలో `పులిమురగన్` లో నటించింది. ఇదే సినిమా తెలుగులో `మన్యం పులి` టైటిల్ తో అనువాదమైంది. ఈ సినిమా రెండు భాషల్లోనూ మంచి హిట్ అయింది.