రామ్ చరణ్ సరసన `పెద్ది` చిత్రంలో నటిస్తోంది జాన్వీ కపూర్. ఎన్టీఆర్ `దేవర` తర్వాత టాలీవుడ్ లో రెండో భారీ చిత్రమిది. ఓవైపు తెలుగు సినిమాల్లో నటిస్తూనే, అటు బాలీవుడ్ కెరీర్ ని సజావుగా నడిపించేస్తోంది. తదుపరి జాన్వీ తన తాజా చిత్రం `పరమ్ సుందరి` విడుదల ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడిపేస్తోంది. ముంబైలో ప్రచార వేదికలపై జాన్వీ కనిపిస్తున్న తీరు ఇటీవల యువతరంలో ప్రత్యేకంగా చర్చగా మారుతోంది.
జాన్వీ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తూ యువతరం హృదయాలను కొల్లగొడుతోంది. పరమ్ సుందరి టైటిల్ కి తగ్గట్టుగానే జాన్వీ ఎంతో అందంగా డిజైనర్ లుక్స్ తో కనిపిస్తూ మతులు చెడగొడుతోంది. తాజాగా అందమైన ఫ్లోరల్ డిజైన్ గౌనులో జాన్వీ అదిరిపోయే ఫోజులిచ్చింది. చూడగానే ఇంతందంగా .. మనసులు దోచేస్తోంది! అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. నేటి జెన్ జెడ్ స్టార్ కిడ్స్ లో జాన్వీ ఎంపికలు చాలా ప్రత్యేకం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ డిజైనర్ లుక్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. పరమ్ సుందరిలో బాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటించాడు. కేరళ అమ్మాయితో ప్రేమను దక్కించుకునేందుకు పాట్లు పడేవాడిగా అతడు కనిపిస్తాడు. క్రాస్ కల్చర్ నేపథ్యంలోని రొమాంటిక్ లవ్ స్టోరి జాన్వీకి హిందీలో బిగ్ బ్రేకిస్తుందేమో చూడాలి.