సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ కన్నా సంక్రాంతికి వస్తున్నాం సినిమా మౌత్ టాక్ తోనే ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించింది. ఆ తర్వాత తండేల్, కోర్ట్, హిట్ 3, సింగిల్ లాంటి చిత్రాలు మీడియం రేంజ్ తో సరిపెట్టేశాయి. ఇక జూన్ నుంచి పెద్ద సినిమాల తాకిడి మొదలైంది. కానీ ఆ పెద్ద సినిమాలు అనుకున్న అంచనాలు అందుకోవడం లేదు.
జూన్ లో వచ్చిన థగ్ లైఫ్ బాగా నిరాశపరిచింది. ఆతర్వాత కుబేర కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో హిట్ అయ్యింది తప్ప మిగతా పాన్ ఇండియా భాషల్లో నిరాశపరిచింది. కన్నప్ప కూడా అనుకున్న అంచనాలను రీచ్ అవ్వలేదు. ఇక ఆగష్టు 14 న వచ్చిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ చాలా క్రేజీగా విపరీతమైన హైప్ తో కనిపించాయి.
అవే వార్ 2, కూలి. వేటికవే చాలా ప్రత్యేకంగా, ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించగలిగే సత్తా ఉంటుంది, పెద్ద హీరోలు.. దానికి తగ్గ బలమైన కథ, కథనాలు ఉంటాయని ఆడియన్స్ భావించారు. కానీ ఆడియన్స్ అనుకున్న స్టఫ్ వార్ 2, కూలి రెండు చిత్రాలు రెండు అందుకోలేక చేతులెత్తేశాయి.
పాన్ ఇండియా భాషల్లో ఉన్న క్రేజీ స్టార్స్ ని పట్టుకొచ్చి కూలి అంటే ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారని లోకేష్ కనగరాజ్ భావించారు. అటు ఇద్దరు స్టార్ హీరోలైన ఎన్టీఆర్-హృతిక్ రోషన్ ల నడుమ యాక్షన్ చూపిస్తే ప్రేక్షకులు జై కొడతారని అయాన్ ముఖర్జీ అనుకున్నారు.
కానీ ఈ రెండు సినిమాలు వర్కౌట్ అవ్వలేదు.
కేవలం మొదటి వీకెండ్ కె కుదేలయ్యాయి. ఆడియన్స్ కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను కోరుకుంటున్నారు. మలయాళంలో అలాంటి చిన్న చిత్రాలే భారీ హిట్ అవుతున్న సమయంలో కూలి, వార్ 2 రెండు చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి.