నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో అక్కినేని నాగార్జున ఎన్నో చిత్రాల్లో నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకు ల్ని అలరించే కంటెంట్ తోనే కింగ్ సినిమాలుంటాయి. వాటిలో ఎక్కువగా యాక్షన్ ఫ్యామిలీ స్టోరీలే అధికం. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసినవి ఆ తరహా చిత్రాలే. ఎన్ని ప్రయో గాలు చేసినా ఏ నటుడైనా చిరస్థాయిగా ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించారంటే? అది ఫ్యామిలీ నేపథ్యమున్న చిత్రాల తోనే. అందుకే నాగార్జున ఓవైపు ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్లతోనూ ప్రేక్షకుల్ని అలరించారు.
ఈ జానర్ ని నాగ్ ఓ సేఫ్ జోన్ గా భావిస్తారు. ఆయన గత చిత్రం `బంగార్రాజు` కూడా కుటుంట నేపథ్యం గల చిత్రమే. అప్పటికే ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న నాగ్ ను ఆ జానరే సక్సెస్ ని అందించింది. ఈ నేపథ్యంలో 100వ సినిమా కథ ఎలాంటిదై ఉంటుంది? అన్న దానిపై అప్పుడే నెట్టింట చర్చ జరుగుతోంది. అయితే నాగ్ మాత్రం సెంచరీ విషయంలో ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా సేఫ్ జోన్ స్టోరీనే ఎంచుకు న్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఫ్యామీలి కథతోనే వందవ సినిమా ఉంటుందని నాగార్జున ప్రకటించారు.
ఆరేడు నెలలుగా ఈ స్టోరీపైనే వర్క్ జరుగుతుందని..తుదిగా స్క్రిప్ట్ సిద్దమైందన్న విషయాన్ని వెల్లడిం చారు. దీంతో వందవ సినిమాపై ప్రేక్షకుల్లో ఓ క్లారిటీ వచ్చినట్లే. అవనసరమైన హైప్ లు రాకుండా నాగ్ ముందుగానే ప్రేక్షకుల్ని ఈ రకంగా సిద్దం చేస్తున్నారు. హైప్ క్రియేట్ అయిన తర్వాత కంటెంట్ లేని సినిమాల పరిస్థితి తొలి షో అనంతరం ఎలాంటి సన్నివేశం తలెత్తుతుందో తెలిసిందే.
నాగ్ మాత్రం ఆ ఛాన్స్ తీసుకోకుండా స్టోరీ లైన్ ఇదీ అని ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ కథను రా కార్తిక్ ఎంత కొత్తగా చూపిస్తాడు? అన్నది అతడి చేతుల్లో పని. దర్శకుడిగా కార్తీక్ కి మంచి అవకాశం. తమిళ్ లో చేసింది ఒక్క సినిమా అయినా? కథపై నమ్మకంతో నాగ్ ఛాన్స్ ఇచ్చారు. ఆనమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కార్తీక్ పైనే ఉంది. ఈ చిత్రానికి `100 నాటౌట్` అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.