సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ను ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో RGV వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ గా మారిపోయి వైసీపీ కి భజన చేస్తూ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ట్వీట్లు వేస్తూ అనుచిత వ్యాఖ్యలు చెయ్యడమే కాకుండా చంద్రబాబు, లోకేష్, పవన్ లపై సినిమాలు తీసి అవమానించారు.
కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వర్మ సైలెంట్ అవడమే కాదు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లకు క్షమాపణలు చెప్పి ఇకపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చెయ్యను అన్నారు. అయినప్పటికి రామ్ గోపాల్ వర్మ పై ఏపీలో పలు కేసులు నమోదు అయ్యాయి. పలుమార్లు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచినా ఆయన చాలాసార్లు విచారణకు రాకుండా తప్పించుకున్నారు.
తాజాగా రామ్ గోపాల్ వర్మ ను ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. అయితే వర్మకు ఇద్దరు వ్యక్తుల పూచికత్తు ఇవ్వడంతో వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. కానీ పోలీసులు RGV ఫోన్ ను సీజ్ చేశారు. ఫోన్ తో సహా ఒంగోలు వచ్చిన ఆయన స్టేషన్లోకి ఫోన్ తీసుకెళ్లలేదు. తన లాయర్ గా పోలీసులకు పరిచయం చేసిన వైసీపీ లీగల్ సెల్ ఇంచార్జ్ వద్ద ఫోన్ ఉంచి వచ్చారు. పోలీసులు ఆ విషయం తెలుసుకుని లాయర్ ను పిలిపించి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.