బిగ్ బాస్ సీజన్ 9 మొదలయ్యేందుకు కేవలం నెల రోజుల సమయమే ఉంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా సీజన్ 9 పై క్రేజ్ పెంచేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈసారి సామాన్యులకు పెద్ద పీట, హౌస్ లో రచ్చే అంటూ ప్రోమోస్ వదులుతున్నారు. గత కొన్ని సీజన్స్ గా తెలుగు బిగ్ బాస్ పై జనాల్లో ఎలాంటి అంచనాలు లేవు.
అందుకే యాజమాన్యం ఏదో ఈ సీజన్ పై క్రేజ్ పెంచాలని కష్టపడుతుంటే మాజీ కంటెస్టెంట్స్ మాత్రం బిగ్ బాస్ పై ఉన్న క్రేజ్ ని తగ్గేలా మాట్లాడుతున్నారు, ఉన్న హైప్ పోయేలా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ కి వెళ్లి తన పేరు పోగొట్టుకున్న టాప్ యాంకర్ బిగ్ బాస్ పై చేసిన కామెంట్స్ చూస్తే ఎవరూ ఇక మీదట బిగ్ బాస్ కి వెళ్లాలి అనుకోరు.
ఆయన సీజన్ 5 లో కనిపించిన మేల్ యాంకర్ రవి. బుల్లితెర షోస్ తో ఫేమస్ అయిన రవి కి సీజన్ 1 నుంచి ఎన్నోసార్లు ఆఫర్స్ వచ్చినా వెళ్లలేదట. 5 వ సీజన్ కి రమ్మనగా రవి తనకు ఇంత ఎమౌంట్ ఇస్తేనే వస్తామని చెప్పాడట. తను అడిగిన అమౌంట్ వాళ్ళు ఇవ్వరని రవి అనుకున్నా.. యాజమాన్యం తనకు అడిగింది ఇవ్వడానికి ఒప్పుకోవడంతో తను వెళ్లాల్సి వచ్చిందట.
అయితే బిగ్ బాస్ స్క్రిప్టెడ్, అక్కడ ఉన్నవాళ్లుకూడా నటిస్తారని ఎవ్వరూ తనకి తానుగా కనిపించరని, నేను నాలా ఉన్నాను అంటే వాళ్ళను చెప్పు తీసుకుని కొట్టాలి అని, తను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు రివ్యూస్ చెప్పేవారు తన పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేసారు అని, బిగ్ బాస్ పరమ చెత్త షో అన్నట్టుగా రవి ఓ ఇంటర్వ్యూలో అందులోను సీజన్ 9 మొదలయ్యే సమయంలో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.