మెగా ఫ్యాన్స్ విశ్వంభర రిలీజ్ డేట్ విషయంలో విసిగి వేసారిపోయి ఉన్నారు. వసిష్ఠ యూట్యూబ్ ఛానల్స్ లో కూర్చుని ఇంటర్వూస్ ఇస్తూ విశ్వంభర పై హైప్ క్రియేట్ చేద్దామని భావించినట్లుగా ఉన్నారు. కానీ విశ్వంభర కు విడుదల డేట్ ఇవ్వకుండా అలా విశ్వంభర విషయాలను రివీల్ చేసినా ఉపయోగం ఉండదు అనేది మెగా ఫ్యాన్స్ ఆవేదన.
అయితే వసిష్ఠ మాత్రం విశ్వంభర విడుదల తేదీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ లో లేదంటే డిసెంబర్ లో విశ్వంభరను విడుదల చేద్దామనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని.. అది ఆగష్టు 22 మెగాస్టార్ చిరు బర్త్ డే సందర్భంగా రివీల్ చెయ్యాలని, అది కూడా అదిరిపోయే వీడియో రిలీజ్ చేస్తూ.. విశ్వంభర విడుదల తేదీ ప్రకటిస్తారని సమాచారం.
అదే ఆగష్టు 22 మెగాస్టార్ బర్త్ డే కి అనిల్ మామ అదేనండి అనిల్ రావిపూడి కూడా #Mega 157 టైటిల్ తో పాటుగా టీజర్ ని ప్లాన్ చేస్తున్నారట. అసలే మెగా 157 పై విపరీతమైన బజ్ ఉంది. అభిమానుల్లో అంతే క్యూరియాసిటీ ఉంది. సో ఆగష్టు 22 న విశ్వంభర నుంచి ఇంకా మెగా 157 నుంచి రెండు అదిరిపోతే ట్రీట్స్ మెగా ఫ్యాన్స్ కోసం నడిచోస్తున్నాయన్నమాట.