ఈమధ్యన చాలామంది సెలబ్రిటీస్ పెళ్లిని ఎంత ఘనంగా చేసుకుంటున్నారో అంతే ఘనంగా విడిపోతున్నారు. పెళ్లి చేసుకుని దశాబ్దాల పాటు కాపురాలు చేసిన జంటలైనా, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ గా తర్వాత ప్రేమికులుగా పెళ్లి పీటలెక్కిన జంటలైనా, లేదంటే ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో ఒక్కటైన జంటలైనా, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు కూడా పెటాకులవుతున్న వేళ మరో సీనియర్ నటి భర్తతో విడిపోతుంది అనే వార్త నెట్టింట్లో సంచలనంగా మారింది.
ఒకపుడు హీరోయిన్ గా అదృష్టాన్ని పరీక్షించుకుని ప్రస్తుతం కేరెక్టర్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రల్లో కనిపిస్తున్న నటి సంగీత పెళ్లి తర్వాత నటనకు కాస్త బ్రేకిచ్చింది. 2009 లో సింగర్ క్రిష్ ను వివాహమాడిన సంగీత కు ఓ అమ్మాయి కూడా ఉంది. అయితే సంగీత తన భర్త క్రిష్ తో విడిపోతుంది అనే వార్త ఒక్కసారిగా ట్రెండ్ అయ్యింది.
రీసెంట్ గా సంగీత తన ఇన్‌స్టాగ్రామ్‌లోని సంగీత క్రిష్ అనే పేరును తీసేసి సంగీతగా మార్చిందని వార్తలు పుట్టడంతో త్వరలోనే సంగీత-క్రిష్ కూడా విడిపోతున్నారు, ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తారంటూ ప్రచారం జోరుగా మొదలైంది. తాజాగా విడాకుల రూమర్స్ పై సంగీత రియాక్ట్ అయ్యింది.
నేను మా ఆయనతో విడిపోతున్నాను అనేది పూర్తిగా అబద్ధం. నేను మొదటి నుంచీ నా ఇన్‌స్టా నా పేరును సంగీత యాక్టర్ గానే ఉంచుతున్నాను. వాస్తవానికి అది ఇప్పటికీ అలాగే ఉంది. మా ఆయనతో కలిసి నేను హ్యాపీ గా ఉన్నాను. అలాంటి రూమర్స్ పై మాట్లాడాలి అని నాకు అనిపించదు. ఈ వార్తలు అంతలా స్ప్రెడ్ అవడంతోనే రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది.