Advertisementt

నార్త్ అమెరికాలో వార్ 2 సంచలనం

Sat 02nd Aug 2025 10:34 AM
war2  నార్త్ అమెరికాలో వార్ 2 సంచలనం
War 2 sets new North American record నార్త్ అమెరికాలో వార్ 2 సంచలనం
Advertisement
Ads by CJ

YRF స్పై యూనివర్స్ నుంచి రాబోతోన్న వార్ 2 చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ఉన్న భారీ హైప్, క్రేజ్‌ని చాటేలా ప్రీ సేల్స్ జరుగుతున్నాయి. వార్ 2 సినిమాకు సంబంధించి నార్త్ అమెరికాలో ఇప్పటికే $100K డాలర్లు క్రాస్ అయింది. ప్రీ సేల్స్‌తోనే వార్ 2 సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఉత్తర అమెరికా మార్కెట్లో USD 100,000 ముందస్తు టిక్కెట్ల అమ్మకాలను దాటిన అత్యంత వేగవంతమైన భారతీయ చిత్రంగా వార్ 2 నిలిచింది.

కేవలం ఏడు గంటల్లోనే ఈ ఘనతను వార్ 2 సాధించింది. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇక ఇదే మైలురాయిని చేరుకోవడానికి ఎన్టీఆర్ దేవర చిత్రానికి 11 గంటల 37 నిమిషాలు పట్టింది. అయితే ఇప్పుడు మళ్లీ వార్ 2తో ఎన్టీఆర్ తన రికార్డును తానే తిరగరాశారు.

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ 2లో కియారా అద్వానీ కథానాయికగా నటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఊపిరి ఊయలలాగా అనే పాట సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఇక ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో వార్ 2 భారీ ఎత్తున విడుదల కాబోతోంది.

War 2 sets new North American record :

War 2 sets new North American record as it becomes the fastest Indian film to cross $100K in pre-sales!

Tags:   WAR2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ