సోషల్ మీడియాలు విచిత్రమైన ప్రచారానికి వేదికలు.. బాలీవుడ్ లో రెండేళ్లుగా సరిగా సినిమాలు ఆడకపోవడంతో ఇండస్ట్రీ పనైపోయిందని విమర్శించారు. టాలీవుడ్ వెలిగిపోతోందని, బాలీవుడ్ పనైపోయిందని కూడా ప్రచారం సాగింది. అంతేకాదు.. మధ్యలో కోలీవుడ్ పని కూడా అయిపోయిందని సోషల్ మీడియా హోరెత్తించింది.
అయితే ఈ తరహా ప్రచారంలో నిజం ఎంత? అనే దానిపై తాజాగా సీనియర్ నటుడు, జాతీయ ఉత్తమ నటుడు ఆర్.మాధవన్ స్పందించారు. `ఆప్ జైసే కోయి` ఓటీటీ సినిమా ప్రచార వేదికపై అతడికి ఈ ప్రశ్న ఎదురైంది. ఇలాంటి ప్రచారం ఎందువల్ల సాగుతోందో తనకు అర్థం కావడం లేదని మాధవన్ అన్నారు. ప్రతి రెండేళ్లకోసారి బాలీవుడ్ డెడ్ అయిపోయిందని ప్రచారం సాగుతోంది. కోలీవుడ్ కూడా డెడ్! అంటూ ప్రచారం సాగిస్తున్నారని మాధవన్ అన్నారు.
పరిశ్రమల్లో ఒడిడుదుకులు సహజమే అయినా సినిమాలు ఫ్లాపులైనప్పుడు ఇలాంటి ప్రచారం సాగిస్తున్నారని మాధవన్ అన్నారు. ఆర్ మాధవన్ తదుపరి రణ్ వీర్ సింగ్ `ధురంధర్` చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో అతడి బట్టతల రూపం చాలా క్యూరియాసిటీ పెంచుతోంది. అలాగే అజయ్ దేవగన్ దేదే ప్యార్ దే 2లోను మ్యాడీ కీలక పాత్రలో కనిపించనున్నాడు.