నిన్న మొన్నటి వరకూ సైలెంట్ గానే కనిపించింది మృణాల్ ఠాకూర్. తన సినిమాలేవో తాను చేసుకుంటూ ముందుకు వెళుతోందని అనుకున్నారు. కానీ బ్యాక్ గ్రౌండ్ లో వర్క్ చూస్తుంటే మృణాల్ చాలా బిగ్ ప్లాన్స్ తో దూసుకెళుతోందని అర్థమవుతోంది.
మృణాల్ తొలిగా తన సోదరుడు ధవల్ ఠాకూర్ ని సినీపరిశ్రమకు పరిచయం చేస్తోంది. గత ఏడాది ఓటీటీలో తుక్రా కే మేరా ప్యార్` అనే సినిమా విడుదలైంది. ఈ ఓటీటీ సినిమాతో ధవల్ హీరోగా లాంచ్ అయ్యాడు. ప్రేమ, కులం, ప్రతీకారం అంటూ స్పెషల్ థీమ్ తో రూపొందించిన ఈ చిత్రం ఓటీటీలో ఆదరణ దక్కించుకుంది. లుక్స్ పరంగా ధవల్ ఠాకూర్ కి మంచి మార్కులే పడ్డాయి.
అయితే ధవల్ కి ఇది సరిపోదు. పెద్ద తెరపైనా ఘనంగా ఎంట్రీ ఇవ్వాలనేది అతడి ప్లాన్. దానికోసం తన సోదరి మృణాల్ తో కలిసి పెద్ద ప్లాన్ చేస్తున్నాడు. నిరంతరం లైమ్ లైట్ లో కనిపిస్తున్నాడు. ఈ గురువారం సాయంత్రం మృణాల్ నటించిన `సన్ ఆఫ్ సర్ధార్ 2` ప్రీమియర్ షోలో కూడా అతడు కనిపించాడు. చాలా మంది సెలబ్రిటీల నడుమ ఈ అక్కా తమ్ముళ్ల సందడి ప్రత్యేకంగా హైలైట్ అయింది. ధవల్ అందగాడు.. పైగా ఆరడుగుల ఎత్తు కనిపిస్తున్నాడు. అతడికి సినీ హీరోగా మంచి భవిష్యత్ ఉంది! అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాల్లో ఆ ఇద్దరి ఫోటోగ్రాఫ్స్ జోరుగా వైరల్ అయిపోతున్నాయి. అయితే తన సోదరుడు పెద్ద స్టార్ అవ్వాలంటే హార్డ్ వర్క్ తో పాటు లక్ కూడా కలిసి రావాలని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.