71st నేషనల్ ఫిలిం అవార్డు లలో నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి కలయికలో సూపర్ హిట్ ఫిలిం గా వచ్చిన భగవంత్ కేసరి కి బెస్ట్ నేషనల్ అవార్డు వరించడం పై బాలయ్య సోషల్ మీడియా వేదికగా స్పందించారు..
71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో భగవంత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం నాకు అపారమైన గర్వకారణం.
ఈ గౌరవం మొత్తం మా చిత్ర బృందానికే చెందుతుంది.
Shine Screens (India) LLP తరఫున చిత్ర నిర్మాతలు సాహు గారపాటి గారు, హరీష్ పెద్ది గారు,
ఈ కథను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు అనిల్ రావిపూడి గారు,
అలాగే ప్రతి కళాకారుడు, సాంకేతిక నిపుణుడు, సిబ్బంది అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది.
జాతీయ అవార్డుల జ్యూరీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ,
భారతదేశంలోని ఇతర జాతీయ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.
వారి ప్రతిభ భారతీయ సినీ రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది.
ఈ గుర్తింపు మాకు మరింత స్ఫూర్తినిస్తూ —
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకే శక్తివంతమైన కథలను అందించాలన్న మా తపనను మరింత బలపరుస్తోంది.
జై హింద్. 🇮🇳
– నందమూరి బాలకృష్ణ