డ్రీమ్ ప్రాజెక్ట్ గా మంచు విష్ణు కన్నప్ప చిత్రాన్ని ఏంతో శ్రమటోడ్చి పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కన్నప్ప రిలీజ్ అయిన సమయంలో క్రిటికల్ ఎక్లెయిన్ పొందింది కానీ.. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్ళు రాబట్టడంలో తడబడింది. భారీ స్టార్ క్యాస్ట్ తో ఓపెనింగ్స్ వరకు ఓకే అనిపించుకున్నా అదే ఊపు ఆపై కొనసాగించలేకపోయింది. భక్తిరస చిత్రం చిత్రీకరణకు విదేశీ లొకేషన్స్ ఎంచుకున్నారని, నాసిరకం గ్రాఫిక్స్ తో నింపేసారని ఓ వర్గం వైపు నుంచి విమర్శలు వినిపించాయి. అయితే హరి హర వీరమల్లు రాకతో కన్నప్ప బెటర్ ప్రాజెక్ట్ గా కనిపిస్తుంది విమర్శకులకి, విశ్లేషకులకి..
పవన్ కళ్యాణ్ లాంటి పవర్ స్టార్ ని హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో పెట్టి భారీ బడ్జెట్ తో, భారీ సెట్టింగ్స్ తో కోట్లాది రూపాయలు వెదజల్లుతూ ఏళ్లకు ఏళ్ళు కాలం గడిపేస్తూ ఎట్టకేలకు ఇటీవలే ప్రేక్షకుల ముందుకు తెచ్చారు హరి హర వీరమల్లు ని. పవర్ స్టార్ చరిష్మా కానీ, సనాతన ధర్మ స్లోగన్ కానీ వీరమల్లు కి విజయాన్ని కట్టబెట్టలేకపోయాయి. పైగా ఆ చిత్రంలో వాడిన సీజీ వర్క్స్ పై సెటైర్స్ సోషల్ మీడియా అంతటా నేటికీ హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఒక్కసారిగా దీనికంటే కన్నప్ప చాలా బెటర్ అనే ఫీలింగ్ కలిగిస్తున్నాయి.
మొత్తానికి తెలియాకుండానే పవన్ కళ్యాణ్ విష్ణు కి ఫేవర్ చేసాడని చెప్పొచ్చు. వీరమల్లు విడుదల తర్వాత కన్నప్ప క్వాలిటీ అమాంతంపెరిగింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వచ్చాక స్మాల్ స్క్రీన్ పై బానే ఉంది అనిపిస్తుంది కన్నప్ప. మరీ ముఖ్యంగా వీరమల్లు వీక్షించిన కళ్ళకు కన్నప్ప బెటర్ గా ఆనుతుంది.