కోలీవుడ్ టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూలి చిత్రంతో ఆగష్టు 14 న రాబోతున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్, నాగార్జున, ఆమిర్, ఉపేంద్ర కలయికలో బడా మల్లీస్టారర్ గా తెరకెక్కిన కూలి చిత్రం పై పాన్ ఇండియాలో విపరీతమైన హైప్ ఉంది. ప్రస్తుతం లోకేష్ ఇంటర్వూస్ లో లోకేష్ కనగరాజ్ పాల్గొంటున్నారు.
కూలి ప్రమోషన్స్ లో లోకేష్ చాలా విషయాలను షేర్ చేసుకుంటున్నారు. కోలీవుడ్ స్టార్ హీరోలైన రజిని, విజయ్, కార్తీ, కమల్ హాసన్ లతో సినిమాలు చేసిన లోకేష్ కనగరాజ్ అజిత్ తో మూవీ ఎప్పుడు చేస్తారా అని ఆయన అభిమానులే కాదు తమిళ తంబీలు కూడా ఎదురు చూస్తున్నారు.
తాజాగా అజిత్ ని డైరెక్ట్ చేసే విషయమై కూలి ప్రమోషన్స్ లో లోకేష్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నారు.. తనకి అజిత్ సార్ అంటే చాలా ఇష్టం అని తమ మధ్య సినిమా రావాలంటే సరైన సమయం రావాలని అప్పుడు ఖచ్చితంగా ఉంటుంది అని కన్ఫర్మ్ చేసారు. దీనితో ఈ క్రేజీ కలయికపై అజిత్ అభిమానుల్లో అప్పుడే విపరీతమైన క్యూరియాసిటి మొదలైంది.