Advertisementt

పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం

Wed 30th Jul 2025 10:54 AM
payal rajput  పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం
Payal Rajput Father No More పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం
Advertisement
Ads by CJ

టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట విషాదం నెల‌కొంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్ పుత్ (68) కన్నుమూశారు. ఈ నెల 28న సాయంత్రం హైద‌రాబాద్‌లో అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు ఈరోజు (జూలై 30న) ఢిల్లీలో నిర్వహించనున్నారు.

పాయ‌ల్ రాజ్‌పుత్ త‌న తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ...  నా పక్కన లేకపోయినా, మీ ప్రేమ నన్ను ప్రతిరోజూ నడిపిస్తుంది. మీ చిరునవ్వు, మీ గొంతు, మీ ఉనికి నాకు చాలా గుర్తుంది. మీరు ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోవచ్చు, కానీ నా హృదయం నుండి ఎప్పటికీ వెళ్ళిపోరు. లవ్ యు నాన్న.. అంటూ పోస్టు చేసింది.

పాయల్ రాజ్‌పుత్ RX 100, వెంకీ మామ, మంగళవారం వంటి చిత్రాలలో నటించి పాపుల‌ర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెంకటలచ్చిమి అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

విషాదం నుంచి పాయల్ రాజ్‌పుత్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రముఖులు, సినీ పరిశ్రమలోని పలువురు ఆమె కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Payal Rajput Father No More:

Payal Rajput Shares Heartfelt Tribute to her father

Tags:   PAYAL RAJPUT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ