ఒకప్పుడు అమితాబ్ బచ్చన్, సన్నీడియోల్ వంటి ప్రముఖ హీరోలకు స్టంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసారు షామ్ కౌశల్. ఈరోజు అమితాబ్, డియోల్ వారసుల కంటే ఉన్నత స్థితిలో ఉన్న హీరో(విక్కీ కౌశల్)ని అందించిన గొప్ప తండ్రి. స్టంట్ కొరియోగ్రాఫర్ షామ్ కౌశల్ కుమారుడు విక్కీ కౌశల్ ఈరోజు బాలీవుడ్ లో పెద్ద హీరో. ఖాన్ ల త్రయం ప్రభ మసకబారుతున్న ఈ సమయంలో విక్కీ కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ కి ఒక పెద్ద దిక్కుగా మారాడు.
అయితే అతడి తండ్రి షామ్ కౌశల్ ఇంతింతై ఎదగడానికి ముందు, కనీస తిండికి లేని దుస్థితిని ఎదుర్కొన్న విషయాన్ని మర్చిపోకూడదు. రూ.3000 అప్పుతో ముంబైలో అడుగుపెట్టి అక్కడ చాలా సంవత్సరాలు సరైన ఉపాధి లేక, తిండి, కనీస అద్దె ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులకు గురయ్యాడు. సేల్స్ మేన్ గా రూ.350 జీతం సంపాదించడం కోసం బస్సుల్లో, రైలులో ప్రయణించేవాడు. పది కిలోమీటర్ల దూరంలోని ఆఫీస్ కి నడిచి వెళ్లేవాడు. చివరికి అజయ్ దేవగన్ తండ్రి, ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ వీరూ దేవగన్ అతడికి అవకాశం కల్పించాడు.
వీరూ కారణంగానే షామ్ కౌశల్ పేరు తెరపై టైటిల్ కార్డ్స్ లో పడింది. తర్వాత పప్పు వర్మ వద్ద ఫైట్స్ కొరియోగ్రఫీని నేర్చుకున్నాడు. సన్నీడియోలో బేతాబ్ తో అతడికి బ్రేక్ వచ్చింది. దశాబ్ధ కాల పోరాటం తర్వాత 1990 నాటికి స్టంట్ కొరియోగ్రాఫర్ గా స్థిరపడ్డాడు. అయితే సేల్స్ మేన్ గా అతడు ఒక రూపాయికే భోజనం సమకూర్చుకుని రోజంతా బతికేవాడు. పావ్ బాజీలు పైసాకే తిని జీవించాడు. చివరికి నటుడిగా మొదటి జీతం 500 అందుకునేంత ఎదిగాడు. స్టంట్ కొరియోగ్రాపర్ గా అతడు కెరీర్ పీక్స్ ని చూసాడు. ఈరోజు అతడి కుమారుడు విక్కీ కౌశల్ బాలీవుడ్ లో అగ్ర హీరో. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కుమారుడు అభిషేక్ కంటే పెద్ద హీరో. విక్కీ 500 కోట్ల క్లబ్ ని అధిగమించి తదుపరి 1000 కోట్ల క్లబ్ హీరోగా మారబోతున్నాడు. అతడు సినీపరిశ్రమలో హార్డ్ వర్కర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. తన తండ్రి గర్వించేంత గొప్ప విజయం సాధించాడు.