దీపిక పదుకొనేను ప్రభాస్ `స్పిరిట్` నుంచి తొలగించాక, ట్రిప్తి దిమ్రీ ఆ స్థానంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. `యానిమల్` తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రిప్తీకి వెంటనే మరో అవకాశం కల్పించాడు సందీప్ రెడ్డి వంగా. అతడి డ్యాషింగ్ డెసిషన్ అందరికీ షాకిచ్చింది. అయితే ఇప్పటివరకూ ట్రిప్తి దిమ్రీ ఈ విషయంపై స్పందించలేదు. దీపిక నిష్క్రమణ తర్వాత ఈ చిత్రానికి ఎంపికవ్వడంపై ఎట్టకేలకు ట్రిప్తి ఓపెనైంది.
ప్రభాస్ నటించిన స్పిరిట్ చిత్రంలో దీపిక స్థానంలో తాను నటిస్తున్నట్లు ట్రిప్తి ధృవీకరించింది. బాలీవుడ్ హంగామాతో తాజా ఇంటర్వ్యూలో త్రిప్తి `స్పిరిట్` గురించి వెల్లడించింది. ``నేను ప్రస్తుతం సౌత్ లో హీరో విశాల్‌తో కలిసి పని చేస్తున్నాను. ఆ చిత్రం కూడా త్వరలో విడుదల కానుంది కాబట్టి నేను దాని గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఆ తర్వాత మిస్టర్ వంగాస్ `స్పిరిట్` తెరకెక్కుతుంది. నేను ఈ సినిమా గురించి ఎగ్జియిటింగ్ గా వేచి చూస్తున్నాను. ఇది ఒక అందమైన చిత్రం``అని అంది.
స్పిరిట్‌లో త్రిప్తి పాత్ర ఎలా ఉంటుంది? అంటే.. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటిస్తోందని కూడా టాక్ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి ఈ చిత్రానికి సంగీతాన్ని ఇప్పటికే ఖరారు చేశాడని, స్వరకర్త హర్షవర్ధన్ రామేశ్వర్ ని ఇప్పటికే ఎంపిక చేసాడని తెలుస్తోంది. 2025 సెప్టెంబర్ రెండవ వారంలో చిత్రీకరణ ప్రారంభమవుతుందని కూడా తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీసు అధికారిగా నటించనున్నాడు. నిరంతరాయంగా చిత్రీకరణ షెడ్యూల్ ఉండేలా చూసేందుకు ప్రభాస్ నుంచి బల్క్ కాల్షీట్లను బ్లాక్ చేయాలని సందీప్ చూస్తున్నాడు. ప్రభాస్ సెప్టెంబర్ 2025 నుండి స్పిరిట్ షూటింగ్ ప్రారంభిస్తారని నిర్మాతల్లో ఒకరైన ప్రణయ్ వంగా గతంలో పేర్కొన్నారు. ఇక ఎనిమిది గంటల పని దినం సహా రకరకాల కారణాలతో దీపిక ఈ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయిన సంగతి తెలిసిందే.