Advertisementt

కూలీ అస‌లు ట్విస్టు గ‌డియారంలో

Thu 17th Jul 2025 12:50 PM
coolie  కూలీ అస‌లు ట్విస్టు గ‌డియారంలో
Rajinikanth Coolie story leaked కూలీ అస‌లు ట్విస్టు గ‌డియారంలో
Advertisement
Ads by CJ

స్క్రీన్ ప్లే మాస్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ నుంచి ఏదైనా సినిమా వ‌స్తోంది అంటే అంద‌రిలో క్యూరియాసిటీ నెల‌కొంటుంది. అత‌డు తెర‌కెక్కించిన ఖైదీ, విక్ర‌మ్ చిత్రాల్లో అత‌డు అద్భుత‌మైన స్క్రీన్ ప్లేల‌తో మ్యాజిక్ చేసాడు. ఆడియెన్ ని సీట్ అంచుకు తెచ్చేంత గ్రిప్పింగ్ థ్రిల్ల‌ర్ల‌ను అత‌డు తెర‌కెక్కించ‌గ‌ల‌డు. అందుకే ఇప్పుడు కూలీపై చాలా ఉత్కంఠ నెల‌కొంది. ఆగ‌స్టు 14న రిలీజ్ కి వ‌స్తున్న ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ పాత్ర‌ను అత‌డు మ‌రో లెవ‌ల్లో చూపించాడ‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

అమెరికాకు చెందిన ఆన్ లైన్ టికెటింగ్ పోర్ట‌ల్ ఫండగో ప్ర‌కారం.. ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ ఏజ్డ్ స్మ‌గ్ల‌ర్ గా క‌నిపిస్తాడు. అత‌డు పాత కాలం గ‌డియారాలు దొంగిలిస్తాడు. వాటి నుంచి సాంకేతిక‌త‌ను కొట్టేస్తాడు. అయితే అత‌ము ముస‌లివాడు (వృద్ధుడు) అయిపోయినా కానీ యుక్త‌వ‌య‌సులో మిగిలిపోయిన ప‌గ ప్ర‌తీకారాన్ని తిరిగి తీర్చుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తాడు. అత‌డు త‌న శ‌త్రువుల‌ను వేటాడాల‌నుకుంటాడు. అయితే అత‌డు యుక్త‌వ‌య‌సులో త‌న‌తో ఉన్న టీమ్ ని తిరిగి రెడీ చేయాల‌నుకుంటాడు.

అదే క్ర‌మంలో అత‌డు పాత కాలం గ‌డియారాల‌నే ఎంద‌కు స్మ‌గుల్ చేస్తున్నాడు?  వాటిలో సాంకేతిక‌త‌తో అత‌డికి పనేంటి? అన్న స్టోరీని లోకేష్ ఇంట్రెస్టింగ్ గా తెర‌కెక్కించిన‌ట్టు ఫండ‌గో వెల్ల‌డించింది. ఏజ్డ్ గోల్డ్ స్మ‌గ్ల‌ర్ దేవా పాత్ర‌లో ర‌జ‌నీ న‌టిస్తున్నాడ‌ని ఇత‌ర ఆన్ లైన్ టికెటింగ్ వెబ్ సైట్ల‌లోను పేర్కొన్నారు. ఈ చిత్రంలో నాగార్జున ఆస‌క్తిక‌ర పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, అమీర్ ఖాన్ అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారు. శ్రుతిహాస‌న్ పాత్ర కూడా ఆస‌క్తిని క‌లిగిస్తుంద‌ని స‌మాచారం. 

Rajinikanth Coolie story leaked:

  Connection between clocks and Coolie  

Tags:   COOLIE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ