మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు బాబి `వాల్తేరు వీరయ్య` లాంటి బ్లాక్ బస్టర్ ని అందించాడు. మాస్ వీరయ్యగా చిరంజీవి పాత్రను అతడు మలిచిన తీరుకు ప్రశంసలు కురిసాయి. చిరు చాలా కాలం తర్వాత ఒక ఎనర్జిటిక్ మాస్ రోల్ తో అభిమానులను అలరించారంటే దానికి కారణం బాబి. మత్స్యకారుల కథలో వీరయ్య పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు.
ఇప్పుడు మరోసారి గత విజయాన్ని మెగాస్టార్ మరోసారి గుర్తు చేసుకోవడమే గాక, దర్శకుడు బాబీని తన ఇంటికి పిలిచి అదిరిపోయే వాచ్ ని కానుకగా ఇచ్చారు. ప్రస్తుతం బాబి ధరించిన ఈ స్పెషల్ వాచ్ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. చిరు ఎంతో ఆప్యాయంగా తన అభిమాని అయిన బాబి భుజంపై చేయి వేసి, అతడు ధరించిన రేర్ వాచ్ ని చూస్తూ ఆనందంగా నవ్వులు చిందిస్తున్నారు. తనని అభిమానించే వారిని తాను కూడా అంతే అభిమానిస్తానని చిరు చెప్పకనే చెబుతున్నారు. ప్రస్తుతం ఈ అరుదైన ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్‌లో వైరల్ గా మారుతోంది. బాబి అందుకున్న ఆ అరుదైన వాచ్ - ఒమెగా సీమాస్టర్ బ్రాండ్. ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదంతా సరే కానీ తదుపరి బాబీతో చిరు సినిమా ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. ఈసారి వాల్తేరు వీరయ్యకు సీక్వెల్ గా `వీరయ్య 2` సినిమాని తెరకెక్కిస్తాడా? అన్నది కూడా వేచి చూడాలి.