Advertisementt

సింగిల్ ఓటీటీపై క్రేజీ న్యూస్

Fri 23rd May 2025 05:44 PM
single ott release  సింగిల్ ఓటీటీపై క్రేజీ న్యూస్
Crazy Update on Single OTT సింగిల్ ఓటీటీపై క్రేజీ న్యూస్
Advertisement
Ads by CJ

స్వాగ్ డిజాస్టర్ తర్వాత హీరో శ్రీవిష్ణు కామెడీ జోనర్ లో చేసిన సింగిల్ థియేటర్స్ లో సూపర్ హిట్ అయ్యింది. కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవడంతో సమ్మర్ లో పిల్లలతో కలిసి ఫ్యామిలీస్ థియేటర్స్ కి కదలడంతో ఈ నవ్వుల డ్రామాకి భారీ లాభాలొచ్చాయి. శ్రీవిష్ణు-వెన్నెల కిషోర్ ట్రాక్ బాగా వర్కౌట్ అవడంతో సింగిల్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేసారు.

సింగిల్ చిత్రం మే 9 న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సమంత శుభంతో పోటీ పడింది. సమంత శుభం కి ఓ వర్గం ఆడియన్స్ కనెక్ట్ అయినా ఎక్కువగా సింగిల్ కి ఓటేశారు ఆడియన్స్. సింపుల్ గా శ్రీవిష్ణు సింగిల్ తో హిట్ కొట్టెయ్యడంతో ఇప్పుడు ఈ చిత్రం ఎప్పుడు ఓటీటీలోస్ట్రీమింగ్ అవుతుందా అని ఫ్యామిలీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సింగిల్ ఓటీటీ హక్కులను ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకోగా.. ఈ చిత్రాన్ని జూన్ 6నుంచి అంటే సింగిల్ థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల్లోపు ఓటీటీలో స్ట్రీమింగ్ కి తెచ్చెందుకు రెడీ అవుతుంది అనే న్యూస్ ఫ్యామిలీ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేసింది. 

Crazy Update on Single OTT :

  Single OTT release from June 6  

Tags:   SINGLE OTT RELEASE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ