Advertisementt

నెగిటివిటి పోయేలా వార్ 2 దర్శకుడి ప్రయత్నం

Fri 23rd May 2025 02:29 PM
ayan mukerji  నెగిటివిటి పోయేలా వార్ 2 దర్శకుడి ప్రయత్నం
Ayan Mukerji shares War 2 working stills నెగిటివిటి పోయేలా వార్ 2 దర్శకుడి ప్రయత్నం
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీలోకి వార్ 2 చిత్రంతో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. అయితే వార్ 2 లో మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా ఉండడంతో ఎన్టీఆర్ స్క్రీన్ స్పేస్ పై రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడమే కాదు, రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్ డే రోజున వదిలిన వార్ 2 టీజర్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా డిజప్పాయింట్ అయ్యేలా ఎన్టీఆర్ లుక్స్, అలాగే ఎన్టీఆర్ స్క్రీన్ స్పేస్ ఉంది. 

సోషల్ మీడియాలో వార్ 2 టీజర్ పై యాంటి ఫ్యాన్స్ చాలా నెగిటివిటి చూపించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా హార్ట్ అయ్యారు. తాజాగా వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీ వార్ 2 వర్కింగ్ స్టిల్స్ వదిలారు. అందులో ఎన్టీఆర్ కి సన్నివేశాన్ని వివరిస్తున్నట్టుగా కనిపిస్తున్న ఓ పిక్ లో ఎన్టీఆర్ సూపర్ కూల్ డాషింగ్ లుక్ లో కనిపించడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. 

ఇదంతా వార్ 2 టీజర్ విషయంలో వస్తున్న నెగిటివిటి పోగొట్టేందుకే అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్, అలాగే హృతిక్, కియారా ల వర్కింగ్ స్టిల్స్ వదిలారని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా అయాన్ ఈ సినిమాకి తన వర్క్ ఎక్స్ పీరియన్స్ షేర్ చేస్తూ.. వార్ 2 స్క్రిప్ట్ తనని ఎంతో కదిలించింది అని అందుకే ఈ సినిమా దర్శకత్వం వహించడానికి సిద్ధం అయ్యానని చెబుతూ.. ఎన్టీఆర్, హృతిక్ ఇంకా కియారా అద్వానీలపై షేర్ చేసిన పిక్స్ ఇపుడు వైరల్ గా మారాయి.

Ayan Mukerji shares War 2 working stills:

Ayan Mukerji shares an emotional note praising War 2 cast

Tags:   AYAN MUKERJI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ