హిట్ ఫ్రాంచైజీ తో భారీ హిట్స్ కొడుతున్న దర్శకుడు శైలేష్ కొలను నాని వాల్ పోస్టర్ బ్యానర్ లో తెరకెక్కించిన హిట్, హిట్ 2 , హిట్ 3 ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకోవడంతో మూడు చిత్రాలు మంచి హిట్ అయ్యాయి. విశ్వక్ సేన్ తో హిట్ చిత్రాన్ని తెరకెక్కిస్తే ఆ చిత్రం ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేసింది.
దానికి సీక్వెల్ గా హిట్ 2 అడివి శేష్ హీరోగా చేస్తే అది కూడా హిట్ అయ్యింది. క్రైమ్ థ్రిల్లర్స్ గా తెరకెక్కిన ఆ రెండు చిత్రాలను ప్రేక్షకులు ఇష్టపడ్డారు. ఇక ఆ తర్వాత అదే జోనర్ లో శైలేష్ కొలను వెంకటేష్ తో సైంధవ్ చిత్రాన్ని తెరకెక్కించగా ఆ చిత్రం మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. హిట్ 2 కి సీక్వెల్ గా నాని హీరోగా హిట్ 3 ని అదే క్రైమ్ జోనర్ లో శైలేష్ కొలను తెరకెక్కించారు.
హిట్ 3 కూడా హిట్ అయ్యింది, అర్జున్ సర్కార్ గా నాని పెరఫార్మెన్స్ కు ఆడియన్స్ క్లాప్స్ కొడుతున్నారు. మూడు చిత్రాల్లో మూడు రకాల క్రైమ్ సీన్స్ అయినా ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు అంటే శైలేష్ ఇకపై ఇలాంటి జోనర్ లోనే సినిమాలు తీస్తారా, ఇక జోనర్ మార్చవా, ఈ హిట్ ఫ్రాంచైజీ ను కొనసాగించాలంటే అదే జోనర్ చెయ్యాలి మరి అనే కామెంట్స్ వినబడుతున్నాయి.
కొత్త హీరోలతో సినిమాని చేస్తే శైలేష్ కొలను ఏమైనా జోనర్ మారుస్తాడేమో చూడాలి. ఇక హిట్ 3 తర్వాత శైలేష్ కొలను నెక్స్ట్ మూవీ పై అలాగే తదుపరి హీరోపై అందరిలో క్యూరియాసిటీ మొదలైంది.