కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కొంతకాలంగా అంటే ఓటీటీలలో విడుదలైన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ చిత్రాల సక్సెస్ తర్వాత ధియేట్రికల్ రిలీజ్ లలో వరసగా వైఫల్యాలు చూస్తున్నారు. కంగువ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత విడుదలైన రెట్రో కూడా కంగువ బాటలోనే పయనిస్తుంది. కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన రెట్రో చిత్రం ఆడియన్స్ ను ఏ విధంగానూ ఇంప్రెస్స్ చెయ్యలేదు.
సూర్య వరసగా ఫెయిల్ అవడం ఆయన అభిమానులను బాగా డిజప్పాయింట్ చేస్తుంది. సూర్య కథల ఎంపికపై దృష్టి పెట్టాలని, దర్శకుల టాలెంట్ ని అంచనా వెయ్యాలని ఆయన అభిమానులు సూర్య కు సలహాలు కూడా ఇస్తున్నారు. సూర్య నెక్స్ట్ చెయ్యబోయే ప్రాజెక్ట్స్ పై ఈ ప్లాప్ చిత్రాల ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది అనేది ఫ్యాన్స్ టెన్షన్.
సూర్య ఇకపై ప్రతి ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. సూర్య నెక్స్ట్ చేయబోయో వాడివాసల్ 2, అలాగే వెంకీ అట్లూరి చిత్రాల విషయంలో సూర్య ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి.