Advertisement

'క్రేజీ అంకుల్స్` శ్రీముఖికి బాగా నచ్చారు!

Thu 19th Nov 2020 05:24 PM
crazy uncles press meet,crazy uncle movie,sreemukhi,sree mukhi  'క్రేజీ అంకుల్స్` శ్రీముఖికి  బాగా నచ్చారు!
Coming soon 'Crazy Uncles Movie` 'క్రేజీ అంకుల్స్` శ్రీముఖికి బాగా నచ్చారు!
Advertisement

త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్  'క్రేజీ అంకుల్స్`

కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌ను రూపొందించ‌డానికి గుడ్ సినిమా గ్రూప్ స‌మాయ‌త్త‌మైన విష‌యం తెలిసిందే.. అందులో భాగంగా  శ్రీముఖి, భరణి, మనో, పోసాని కృష్ణ మురళి,రాజా రవీంద్ర ముఖ్య పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న‌ చిత్రం `క్రేజీ అంకుల్స్` ఇ. సత్తిబాబు దర్శకత్వంలో శ్రీవాస్ 2 క్రియేటీవ్స్ బ్యానర్స్ పై రూపొందుతోన్న‌ ఈ చిత్రం షూటింగ్ ఒక పాట మిన‌హా పూర్త‌య్యింది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో..

ప్ర‌ముఖ సింగ‌ర్‌, న‌టుడు మ‌నో మాట్లాడుతూ  - ``క్రేజీ అంకుల్స్ సినిమాలో ఒక మంచి ఎంటర్టైనింగ్ రోల్ లో నటించాను. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్‌లో మంచి యూనిట్‌తో సినిమా చేయ‌డం సంతోషంగా ఉంది. షూటింగ్ సరదాగా జరిగింది. ఫ్యామిలీ అందరూ హాయిగా నవ్వుతూ చూసే సినిమా ఇది. రాజారవీంద్ర‌, శ్రీముఖి గారితో వర్క్ చెయ్యడం హ్యాపీగా ఉంది. శ్రీవాస్ గారు భవిషత్తులో ఇలాంటి మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రేజి అంకుల్స్ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను`` అన్నారు

న‌టుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ - ``ఈ సినిమాలో నేను  యోగ టీచర్ గా కనిపించబోతున్నాను. కరోన సమయంలో వర్క్స్ లేక ఇబ్బందులు పడుతున్న ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ కు గుడ్ సినిమా గ్రూప్స్ వారు వారికి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉపాది క‌ల్పించ‌డం నిజంగా అభినందించాల్సిన విష‌యం. భవిష్య‌త్తులో గుడ్ సినిమాస్ గ్రూప్ సంస్థ నుండి మ‌రిన్ని మంచి సినిమాలు రావాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను. మంచి సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉంది. ఈ మూవీ త‌ప్ప‌కుండా  అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది`` అన్నారు.

నిర్మాత‌ శ్రీవాస్ మాట్లాడుతూ - ``శ్రేయాస్ శ్రీను గారు  నేను కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్న టైమ్ లో నాకు రైటర్ డార్లింగ్ సామి చెప్పిన పాయింట్ నచ్చి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చెయ్యడం జరిగింది. ఎంటర్టైన్మెంట్ ను బేస్ చేసుకొని చేసిన చిత్ర‌మిది. శ్రీముఖి, రాజా రవీంద్ర, మనో ఇలా అందరి రోల్స్ ఆడియన్స్ ను అలరించబోతున్నాయి. డైరెక్టర్ సత్తిబాబు స్క్రిప్ట్ ను బాగా హ్యాండిల్ చేశారు. ఈ కోవిడ్ టైంలో మేము మరింత మందికి హెల్ప్ చెయ్యాలని అనుకుంటున్నాము`` అన్నారు.

న‌టుడు రాజా రవీంద్ర మాట్లాడుతూ - ``నేను ఈ మధ్య కాలంలో  చేసిన ఫుల్ లెన్త్ ఎంటర్‌టైన్‌మెంట్‌ రోల్ ఇది. శ్రీవాస్ కథ చెబుతున్నప్పుడే చాలా ఎంజాయ్ చేశాను. సినిమా షూటింగ్ కూడా సరదాగా సాగిపోయింది. ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఇది`` అన్నారు.

న‌టి శ్రీముఖి మాట్లాడుతూ - ``శ్రేయాస్ శ్రీను గారు ఎన్నో పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసి సక్సెస్ అయ్యారు. ఆయన ప్రొడక్షన్ చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. టీవీలో ఎక్కువగా షోస్ చేస్తున్న నేను క్రేజీ అంకుల్స్ సినిమాలో ఒక మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఒక పాట మిన‌హా దాదాపు షూటింగ్ పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే ఆ పాట చిత్రీక‌ర‌ణ జ‌రుప‌బోతున్నాం. . గుడ్ సినిమా గ్రూప్ లో ఇదొక మంచి మూవీగా నిలుస్తుంద‌ని భావిస్తున్నాను`` అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు  ఇ. సత్తిబాబు మాట్లాడుతూ - ``గుడ్ సినిమా బ్యాన‌ర్‌లో రాబోతున్న క్రేజీ అంకుల్స్  చాలా ఫన్నీగా అందరిని అలరించే విధంగా ఉంటుంది.  కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమా చేస్తున్నప్పుడు మా టీమ్ అంద‌రం ఎంత ఎంజాయ్ చేశామో చూస్తున్నపుడు ఆడియన్స్ అంతే ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది`` అన్నారు.

నటి హేమ మాట్లాడుతూ - ``క్రేజీ అంకుల్స్ కథ నాకు బాగా నచ్చింది. శ్రేయాస్ శ్రీను గారితో నేను చాలా ఈవెంట్స్ చేశాను, అతనితో కలిసి సినిమా చెయ్యడం హ్యాపీగా ఉంది`` అన్నారు.

శ్రీముఖి, మనో, రాజారవీంద్ర, భరణి, పోసాని కృష్ణమురళి, అదుర్స్ రఘు, గిరిధర్, హేమ, గాయత్రి భార్గవి, విజయ మూర్తి, వాజ్పై, మహేంద్ర నాథ్, సిందూరి, మాధురి త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి..

కథ, మాటలు: డార్లింగ్ సామి, సినిమాటోగ్రఫీ: పి. బాలరెడ్డి, సంగీతం: రఘు కుంచె, ఎడిటర్: నాగేశ్వర రెడ్డి, పబ్లిసిటీ డిజైనర్: ధ‌ని ఏలే, స్టిల్స్: పి ఎల్.గణపతి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: అడ్డాల శ్రీనివాస్, ఆనంద్ తాళ్లూరి, లైన్ ప్రొడ్యూసర్: సాయిబాబు వాసిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి, ఫైనాన్స్ డైరెక్టర్: రవి కొమ్మినేని, ప్రజెంట్స్: కిరణ్ కె తలసిల, కోప్రొడ్యూసర్: లయన్ వై కిరణ్, ప్రొడ్యూసర్స్: గుడ్ ఫ్రెండ్స్, డైరెక్టర్: ఇ. సత్తిబాబు.

Coming soon 'Crazy Uncles Movie`:

Full Length Family Entertainer 'Crazy Uncles Movie`

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement