క్రైం థ్రిల్లర్ ‘రేప్‌డి’.. మొదలెట్టారు

Arjun Mahi, Karunya Chowdary starring RapeD shooting started

Tue 15th Sep 2020 09:45 PM
arjun mahi,karunya chowdary,star,raped,shooting,start  క్రైం థ్రిల్లర్ ‘రేప్‌డి’.. మొదలెట్టారు
Arjun Mahi, Karunya Chowdary starring RapeD shooting started క్రైం థ్రిల్లర్ ‘రేప్‌డి’.. మొదలెట్టారు
Advertisement

టాలెంట్ కేఫ్ బ్యానర్ పై క్రైం థ్రిల్లర్ ‘రేప్‌డి’ పూజా కార్యక్రమాలతో ప్రారంభం!

టాలెంట్ కేఫ్ బ్యానర్‌లో ఇష్టంగా ఫేమ్ అర్జున్ మహి, శేఖరం గారి అబ్బాయి ఫేమ్ విన్ను మద్దిపాటి హీరోలుగా కారుణ్య చౌదరి, మాయ నెల్లూరి, అమీక్ష హీరోయిన్లుగా రవిశర్మ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న వెబ్ సిరీస్ ‘రేప్‌డి’. క్రైం థ్రిల్లర్‌గా ఉండబోతున్న ఈ వెబ్ సిరీస్ అత్యంత ఆసక్తికరంగా ఉండనుంది. శనివారం రోజు ఈ వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలు టాలెంట్ కేఫ్ ఆఫీసులో జరిగింది. రెగ్యులర్ షూటింగ్ కూడా అదే రోజు ప్రారంభం అయ్యింది. వీడు మాములోడు కాదు, ఝలక్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రవిశర్మ ఈ వెబ్‌సిరీస్‌ను డైరెక్ట్ చేయబోతున్నారు. 

ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత శ్రీదేవి గారు మాట్లాడుతూ...

షూటింగ్ షెడ్యూల్స్ ఈ నెల 22వ తేదీ వరకు ఉంటుంది. సెకండ్ షెడ్యూల్ అక్టోబర్ మూడోవారంలో ఉంటుంది. మొత్తం 15 ఎపిసోడ్స్‌గా ఈ వెబ్‌సిరీస్‌ను చిత్రీకరించబోతున్నాము. సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులతోనే ఈ వెబ్‌సిరీస్ తీస్తామని తెలిపారు. 

నటీనటులు:

అర్జున్ మహి, కారుణ్య చౌదరి, రవి వర్మ, విన్ను మద్దిపాటి, మాయ నెల్లూరి, అమీక్ష, దువ్వాసి మోహన్, జోష్ రవి, అనుపమ స్వాతి, శిరీష, నేహల్

సాంకేతిక నిపుణులు:

కెమెరా:భాస్కర్ ద్రోనాల

కథ, మాటలు: ప్రకాష్ వేద

ఎడిటింగ్: మహేష్ కాసర్ల

సంగీతం: వికాస్ కురిమిళ్ళ

ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీదేవి మెరేటి

సహ నిర్మాత: యశ్వంత్ తోట

నిర్మాణం: టాలెంట్ కేఫ్

స్క్రీన్ ప్లే, డైరెక్షన్: రవిశర్మ

Arjun Mahi, Karunya Chowdary starring RapeD shooting started:

RapeD web series details out


Loading..
Loading..
Loading..
advertisement