టాలీవుడ్ తాజా అప్ డేట్స్..!

Fri 26th Aug 2016 12:49 PM
raju gari gadhi 2,pvp,ohmkar,dwaraka,dwaraka movie teaser launch,vijay devarakonda,vicharana the crime,c kalyan  టాలీవుడ్ తాజా అప్ డేట్స్..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్..!
Sponsored links

1. ఓంకార్, పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న 'రాజుగారి గది 2'

ఆట డ్యాన్స్ షోతో పాటు పాపులర్ టీవీ యాంకర్ గా పేరు తెచ్చుకుని సినిమా రంగంలో దర్శకుడిగా రాజుగారి గది వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాను రూపొందించిన ఓంకార్, ప్రముక నిర్మాణ సంస్థ బ్యానర్ మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్  కాంబినేషన్ లో 'రాజుగారి గది2' రూపొందుతోంది. 2015లో విడుదలైన రాజుగారి గది చిత్రం పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యింది. అంతే కాకుండా హర్రర్ కామెడి జోనర్ లో ఓ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది.

ఓంకార్ రాజుగారి గది చిత్రాన్ని వారాహి చలనచిత్రంతో సహకారంతో నిర్మించిన సంగతి తెలిసిందే. కాగా 'రాజుగారి గది2' చిత్రానికి పివిపి సినిమా బ్యానర్ తోడు కావడంతో కాస్టింగ్ విషయంలో కానీ, టెక్నికల్ పరంగా కానీ సినిమా స్కేల్ పెరిగింది. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తారు.

పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్, ఓక్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్స్ సంయుక్తంగా రాజుగారి గది 2 చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరికొన్ని విషయాలు, నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు తెలియజేస్తామని పివిపి సినిమా వర్గాలు తెలియజేశాయి.  

2. సూప‌ర్‌గుడ్ ఫిలింస్ 90వ సినిమా 'ద్వార‌క‌' టీజ‌ర్‌..లాంచ్ 

సూప‌ర్‌గుడ్ ఫిలింస్ స‌మ‌ర్ప‌ణ‌లో లెజెండ్ సినిమా ప‌తాకంపై ప్ర‌ద్యుమ్న‌- గ‌ణేష్ సంయుక్తంగా నిర్మించిన సినిమా 'ద్వార‌క‌'. 'పెళ్లిచూపులు' ఫేం విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడు. పూజా జ‌వేరి క‌థానాయిక‌. శ్రీ‌నివాస్ ర‌వీంద్ర (ఎంఎస్ఆర్‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా..  స‌మ‌ర్ప‌కుడు ఆర్‌.బి.చౌద‌రి ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్, సాంగ్ (భ‌జ‌రే నంద‌గోపాల హ‌రే..) టీజ‌ర్‌ని లాంచ్ చేశారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ...

ఆర్‌.బి.చౌద‌రి మాట్లాడుతూ -ఇది మా బ్యాన‌ర్ నుంచి వ‌స్తున్న 89వ సినిమా. ఎంతోమంది న‌టీన‌టులు, ద‌ర్శ‌కులు, టెక్నీషియ‌న్ల‌ను ప‌రిచ‌యం చేశాం. అదే కోవ‌లో ఈ సినిమాతో కొత్త నిర్మాత‌లు ప్ర‌ద్యుమ్న‌-గ‌ణేష్‌ల‌ను ప‌రిచ‌యం చేయ‌డం సంతోషంగా ఉంది. తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమాలు నిర్మించాం.  అలాగే శ్రీ‌నివాస్ ర‌వీంద‌ర్ లాంటి ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేయ‌డం హ్యాపీగా ఉంది. సాయికార్తిక్ అంద‌మైన సంగీతం అందించాడు. ఒక పాట మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. వ‌చ్చే నెల‌లో సినిమా రిలీజ్ చేయ‌నున్నాం... అన్నారు. 

నిర్మాత ప్ర‌ద్యుమ్న‌ మాట్లాడుతూ...20 ఏళ్ల క్రితం ప్యాష‌న్‌తో సినీప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చాను. ల‌క్కీగా ఆర్‌.బి.చౌద‌రి వంటివారి అండ ల‌భించింది. ఎంతోమంది లైఫ్‌ని త్యాగం చేసి ఇక్క‌డికి వ‌చ్చి ఎంతో క‌ష్ట‌ప‌డుతుంటారు. సినిమా అనేది సామాజిక బాధ్య‌త‌. విజ్ఞానంతో తీయాలి. నిర్మాత‌ల‌కు ఆ తెలివితేట‌లు, నాలెడ్జి ఉండాలి. 90 సినిమాలు తీసిన నిర్మాత ఆర్‌.బి.చౌద‌రి గారు మా వెన్నంటి నిల‌వ‌డం నా అదృష్టం. ఆయ‌న మాపై పెద్ద బాధ్య‌త ఉంచారు. 24 శాఖ‌ల‌కు సంబంధించిన కుటుంబాలు ప‌రిచయం కావ‌డం ఆనందాన్నిచ్చింది. ఈ సినిమా క‌థ‌ని న‌మ్మి హీరో ఓకే చెప్పారు. సుప్రీం వంటి పెద్ద సినిమాలు చేసిన సాయి కార్తిక్ అండ‌గా నిలిచి సంగీతం అందించారు. శ్యామ్‌.కె నా వెంటే నిలిచారు. ల‌క్ష్మీ భూపాల్ మాట‌ల‌కు అవార్డు వ‌స్తుంది. ఈ సినిమాకి స‌పోర్టు చేసిన అంద‌రికీ పేరు పేరునా వంద‌నాలు... అన్నారు. 

ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ మాట్లాడుతూ...2015లో ఈ సినిమాకి క‌మిట‌య్యాను. క‌థ విష‌యంలో ఆర్‌.బి.చౌద‌రి గారిని క‌న్విన్స్ చేయ‌డం అంత ఈజీ కాదు. ఆయ‌న్ను ఒప్పించి ఈ సినిమా పూర్తి చేయ‌గ‌లిగాను. తెర‌పై విజువ‌ల్స్ చూసి ఆశీర్వ‌దించండి..అన్నారు. 

మాట‌ల ర‌చ‌యిత ల‌క్ష్మీ భూపాల్ మాట్లాడుతూ..టాప్ టెక్నీషియ‌న్ల‌తో, ఆర్‌.బి.చౌద‌రి గారి అండ‌తో తీసిన సినిమాకి ప‌నిచేయ‌డం సంతోషంగా ఉంది. నాలుగైదేళ్ల క్రిత‌మే ఈ క‌థ‌ను ద‌ర్శ‌క‌నిర్మాత‌లకు చెప్పాను. పెళ్లి చూపులు హీరో హిట్‌తో ఊపుమీదున్నాడు. ఈ సినిమాతో మ‌రో పెద్ద విజ‌యం అందుకోవాలి... అన్నారు. 

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ...పెళ్లి చూపులు విజ‌యంతో క్ష‌ణం తీరిక లేకుండా అయిపోయాను. ఆ విజ‌యాన్ని ఆస్వాధిస్తుండ‌గానే 'ద్వారక' వ‌చ్చేస్తోంది. అంద‌రూ టాప్ టెక్నీషియ‌న్ల‌తో, ఆర్‌.బి.చౌద‌రి గారి బ్యాన‌ర్‌లో సినిమా అంటే షాక్‌కి గుర‌య్యాను. మెగా నిర్మాత‌ల్ని నా ఖాతాలో వేసుకున్నానా? అనిపించింది. ద్వార‌క క‌థ న‌చ్చి ఓకే చెప్పాను. వైవిధ్యం ఉన్న క‌థ‌ని నిర్మాత‌లు ఎంక‌రేజ్ చేయ‌డం హ్యాపీ. గ‌ణేష్ కొరియోగ్ర‌ఫీలో వైవిధ్య‌మైన డ్యాన్సులు వేశాను... అన్నారు. 

నిర్మాత గ‌ణేష్‌, శ్యామ్‌.కె.నాయుడు, మాజీ ఇన్‌కంట్యాక్స్ క‌మిష‌న‌ర్ పార్థ‌సార‌థి, సాయికార్తిక్‌, బ్ర‌హ్మ‌క‌డ‌లి, పూజా జ‌వేరి, పి.హ‌రికృష్ణ‌, గిరిధ‌ర్ త‌దిత‌రులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

3. సి.కళ్యాణ్  సమర్పణలో కల్పనాచిత్ర 'విచారణ' (ది క్రైమ్)

'విశారణై' పేరుతో విడుదలై సంచలన విజయం సాధించడంతోపాటు.. 'ఉత్తమ ప్రాంతీయ చిత్రం'గా జాతీయ అవార్డు అందుకున్న తమిళ చిత్రం..  'విచారణ' పేరుతో తెలుగులో విడుదల కానుంది. 'ది క్రైమ్' అన్నది ట్యాగ్ లైన్.  ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సమర్పణలో..  కల్పనాచిత్ర పతాకంపై ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతకుముందు 'ఆదుకాలం' అనే చిత్రం రూపొందించి, ఆ చిత్రానికి కూడా జాతీయ అవార్డు అందుకున్న తమిళ సంచలనం  వెట్రిమారన్ దర్శకత్వం వహించిన 'విచారణ' చిత్రం తమిళ్ వెర్షన్ కు ప్రముఖ హీరో ధనుష్ నిర్మాత కావడం విశేషం. ఓ ఆటో డ్రైవర్ జీవితంలో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం..  రజినీ, కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్స్ ప్రశంసలు దండిగా పొందింది. 'ఇటీవలకాలంలో ఇంత గొప్ప చిత్రాన్ని తాము చూడలేదని' పలువురు ప్రఖ్యాత దర్శకులు సైతం ఈ చిత్రంపై అభినందనల వర్షం కురిపించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఆనందిని అఛ్చ తెలుగు అమ్మాయి కావడం మరో ముఖ్య విశేషం. 

చిత్ర సమర్పకులు సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. 'విచారణ' (ది క్రైమ్) చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా అవార్డులు పొందిన సినిమాలకు రివార్డులు (కలెక్షన్స్) అంతగా రావు. అలాగే, రివార్డ్స్ వఛ్చిన సినిమాలకు అవార్డ్స్ రావు. కానీ.. 'విచారణ' (ది క్రైమ్) చిత్రం మాత్రం ఇందుకు మినహాయింపు. ఈ చిత్రానికి 'రివార్డులు, అవార్డులు' సమానంగా వచ్చాయి. తమిళంలో అసాధారణ విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ చాలా పెద్ద విజయం సాధించడం ఖాయం. వెట్రిమారన్ దర్శకత్వ ప్రతిభ, జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ ఈ  చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు... అన్నారు.  

దినేష్, ఆనంది, కిషోర్, ఆదుకాలం మురుగదాస్, సముద్రఖని, అజయ్ ఘోష్  ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా:  ఎస్.రామలింగం, సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, సమర్పణ: సి.కళ్యాణ్, నిర్మాణం: కల్పనాచిత్ర, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వెట్రిమారన్ !!

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019