Advertisementt

'క్షణం' మూవీ ఫస్ట్ లుక్ లాంచ్!

Wed 03rd Feb 2016 05:42 PM
kshanam movie first look,anasuya,adavi sesh,adha sharma,ravikanth perepu  'క్షణం' మూవీ ఫస్ట్ లుక్ లాంచ్!
'క్షణం' మూవీ ఫస్ట్ లుక్ లాంచ్!
Advertisement
Ads by CJ

అడవి శేష్, ఆదా శర్మ, అనసూయ భరద్వాజ ప్రధాన పాత్రల్లో రవికాంత్ పేరెపు దర్శకత్వంలో పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'క్షణం'. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను బుధవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా..

దర్శకుడు రవికాంత్ పేరెపు మాట్లాడుతూ.. ''ఓ సస్పెన్స్ డ్రామాగా 'క్షణం' చిత్రాన్ని రూపొందించాం. నేను అడవి శేష్ కలిసి ఈ సినిమా కథను రాసుకున్నాం. ఆ కథను పి.వి.పి గారికి వినిపించిన మూడు రోజుల్లోనే ఓకే చేసి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. నా మొదటి సినిమా పి.వి.పి బ్యానర్ లో చేయడం చాలా సంతోషంగా ఉంది. మూడు సంవత్సరాల చిన్నపాప కనిపించకుండా పోతుంది. ఆ పాపను వెతికే ప్రయాణమే ఈ 'క్షణం'. అనసూయ పోలీస్ పాత్రలో అధ్బుతంగా నటించింది'' అని చెప్పారు.

నిర్మాత పి.వి.పి మాట్లాడుతూ.. ''పి.వి.పి సినిమాస్ ఒక్కరి బ్యానర్ కాదు. చాలా మంది కలిసి వర్క్ చేస్తున్నాం. యంగ్ టాలెంట్ ను ప్రమోట్ చేయాలని రవికాంత్, అడవి శేష్ లాంటి వాళ్ళతో కలిసి ఈ సినిమాను నిర్మించాం. సినిమాలో కంటెంట్, ఎనర్జీ ఉంటే కొత్త వాళ్ళతో అయినా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సినిమా అందరు థ్రిల్ ఫీల్ అయ్యే విధంగా ఉంది. మార్చి 4న సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.

అడవి శేష్ మాట్లాడుతూ.. ''మా మీద నమ్మకంతో సినిమాను నిర్మించిన పి.వి.పి గారికి థాంక్స్. రవికాంత్ నా అంచనాలకు మించి వర్క్ చేశాడు. సినిమా ఫ్రెష్ గా ఉంటుంది. అందరు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

అనసూయ మాట్లాడుతూ.. ''రియలిస్టిక్ కాన్సెప్ట్ ను తీసుకొని సినిమాగా రూపొందించారు. ఈ సినిమాలో నేను కాప్ పాత్రలో కనిపిస్తాను. పి.వి.పి గారు ఎంతో నమ్మకంతో సినిమాను నిర్మించారు. మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

సత్య దేవ్ మాట్లాడుతూ.. '''జ్యోతిలక్ష్మి' సినిమా తరువాత పి.వి.పి బ్యానర్ లో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇదొక సస్పెన్స్ డ్రామా. ప్రతి పాత్ర కొత్తగా ఉంటుంది. డైరెక్టర్ రవికాంత్ కు మొదటి చిత్రమయినా ఎలాంటి బెరుకు లేకుండా మొత్తం తానై సినిమా నడిపించాడు'' అని చెప్పారు.

ఈ చిత్రానికి కథ: అడవి శేష్, ఎడిటింగ్: అర్జున్ శాస్త్రి, రవికాంత్ పేరెపు, స్క్రీన్ ప్లే: రవికాంత్ పేరెపు, అడవి శేష్, సినిమాటోగ్రఫీ: షనిల్ డియో, సాహిత్యం: సిరాశ్రీ, రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్: శ్రీ చరణ్ పాకాల, డైలాగ్స్, స్క్రిప్ట్స్ గైడన్స్: అబ్బూరి రవి, నిర్మాత: పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, దర్శకత్వం: రవికాంత్ పేరెపు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ