Advertisementt

ఇదేనా బాహుబలి కొత్త లుక్!

Wed 03rd Feb 2016 05:42 PM
baahubali comics,baahubali animations,baahubali games,graphic india  ఇదేనా బాహుబలి కొత్త లుక్!
ఇదేనా బాహుబలి కొత్త లుక్!
Advertisement
Ads by CJ

బాహుబలి సినిమా గూర్చి వచ్చే ప్రతి తాజా సమాచారం కోసం యావత్ భారత దేశమే కాదు, ప్రపంచంలోని సినీ ప్రియులు ఎందఱో వేచి చూస్తున్నారు. ఇక ఈ రోజు బాహుబలికి సంబంధించి ఓ ప్రత్యేకమైన న్యూస్ ఉండబోతుందని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెర పడింది. ఈ సమాచారం పూర్తిగా సినిమాకి సంబంధించి కాకపోయినా బాహుబలి ప్రపంచంలోకి జనాలని మరింత లోతుగా తీసుకెళ్ళడానికి కామిక్స్, యానిమేషన్, గేమ్స్ వంటిని ఎన్నో బాహుబలి పేరిట రాబోతున్నాయి. ఇందుకు గాను గ్రాఫిక్ ఇండియా అనే సంస్థతో బాహుబలి నిర్మాతలు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. అందులో మొదటగా ఇదిగో పైన చూస్తున్నారుగా బాహుబలి కొత్త కామిక్ లుక్ విడుదలయింది. పిల్లల్లో బుక్స్ రీడింగ్ అలవాటు చేసేందుకు ఈ కామిక్స్ ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి కాబట్టి తొందరలో మార్కెట్టులో దొరకబోయే బాహుబలి కామిక్ పుస్తకాలని చిన్నారులకి గిఫ్ట్ చేయొచ్చు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ