Advertisement

'జిల్లా’ ఆడియో విడుదల..!

Mon 22nd Jun 2015 12:00 PM
jilla movie,vijay,kajal,mohan lal,subbiramireddy  'జిల్లా’ ఆడియో విడుదల..!
'జిల్లా’ ఆడియో విడుదల..!
Advertisement

సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ ఆర్‌.బి.చౌదరి సమర్పణలో.. శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్‌ పతాకంపై  తమటం కుమార్‌రెడ్డి, ప్రసాద్‌ సన్నితి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘జిల్లా’. నామన శంకర్రావు సహ నిర్మాత. ఈ చిత్రం ఆడియో తాజ్‌ డెక్కన్‌లో ఆటపాటల నడుమ అత్యంత ఘనంగా నిర్వహించిన వేడుకలో విడుదలయ్యాయి. డి.ఇమాన్‌ సంగీత సారధ్యంలో వెన్నెలకంటి సాహిత్యంతో రూపొందిన ‘జిల్లా’ ఆడియో మధుర ఆడియో ద్వారా మార్కెట్‌లో లభ్యం కానుంది. విజయ్‌, కాజల్‌ జంటగా మోహన్‌లాల్‌ ముఖ్యపాత్రలో రూపొందిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, సంపత్‌రాజ్‌, ప్రదీప్‌ రావత్‌, మహత్‌ రాఘవేంద్ర, ఎల్‌.బిశ్రీరాం, సురేఖావాణి, పూర్ణిమ భాగ్యరాజ్‌ ఇతర ముఖ్యపాత్రధారులు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా విచ్చేసిన శాసనసభ్యులు పార్ధసారధిరెడ్డి, నిన్నటి మేటి కథానాయకి రాశి, ఆర్‌.బి.చౌదరి తనయుడు`కథానాయకుడు రమేష్‌ చౌదరి, ప్రముఖ నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్‌, జడ్జి స్వామి, లవర్స్‌ హరి, యస్‌.వి.ఆర్‌.శోభ, సముద్ర, రఘు కుంచె, మధుర శ్రీధర్‌ తదితర ప్రముఖులు ఒక్కో పాటను విడుదల చేయగా.. టి.సుబ్బరామిరెడ్డి ఆడియోను విడదుల చేసి, తొలి ప్రతిని రమేష్‌ విద్యార్ధికి అందజేసారు. తమిళంలో ఆర్‌.బి.చౌదరిగా నిర్మించగా సంచలన విజయం సాధించిన ‘జిల్లా’ తెలుగులోనూ ఘన విజయం సాధించడం తధ్యమని అతిధులందరూ పేర్కొన్నారు. ‘జిల్లా’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించే అవకాశాన్నిచ్చిన ఆర్‌.బి.చౌదరిగారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని.. ఆయనతో కలిసి త్వరలో ఓ స్ట్రయిట్‌ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తమటం కుమార్‌రెడ్డి`ప్రసాద్‌ సన్నితి అన్నారు. వైవిధ్యానికి పెద్ద పీట వేసే తెలుగు ప్రేక్షకులు ‘జిల్లా’ చిత్రాన్ని కచ్చితంగా పెద్ద స్థాయిలో ఆదరిస్తారని రమేష్‌ చౌదరి అన్నారు. ప్రపంచ సంగీత దినోత్సవం రోజు ‘జిల్లా’ పాటలు తమ ఆడియో కంపెనీ ద్వారా విడుదల కావడం పట్ల ‘మధుర’ శ్రీధర్‌ సంతోషం వ్యక్తం చేసారు. తండ్రీకొడుకుల అనుబంధం నేపధ్యంలో రూపొందిన ‘జిల్లా’ చిత్రం ఆడియో ‘ఫాదర్స్‌ డే’ రోజు విడుదలవుతుండడం చాలా ఆనందంగా ఉందని చిత్ర దర్శకుడు ఆర్‌.టినేసన్‌ అన్నారు. శ్రేయాస్‌ మీడియా సారధ్యంలో.. శిల్పాచక్రవర్తి వ్యాఖ్యాతగా` ఆసాంతం అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ వేడుకలో ఏర్పాటు చేసిన ఆటపాటలు, సాహస విన్యాసాలు ఆహుతులను విశేషంగా అలరించాయి!!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement