11కోట్లు వ‌ద్ద‌నుకొన్న బ‌న్నీ..!

Tue 16th Jun 2015 12:50 PM
allu arjun,allu arjun refuses dance program,bunny,nri  11కోట్లు వ‌ద్ద‌నుకొన్న బ‌న్నీ..!
11కోట్లు వ‌ద్ద‌నుకొన్న బ‌న్నీ..!
Advertisement
అమెరికాలో ఐదు సిటీల్లో ఐదు వేదిక‌ల‌పై డ్యాన్స్ వేయండి, 11 కోట్లు ఇస్తాం... అంటూ ఓ డీల్‌తో వ‌చ్చారు కొద్దిమంది ఎన్నారైలు. ఏ మాత్రం మొహ‌మాటం లేకుండా  ఆ డీల్‌ని తిర‌స్క‌రించాడట బ‌న్నీ. `` ఏదైనా ఛారిటీ కోసం పిల‌వండి వ‌స్తాను కానీ... డబ్బు కోసమైతే నేను స్టేజీల‌పై ఆడిపాడ‌ను`` అని చెప్పి పంపించాడ‌ట‌. అంత పెద్ద ఆఫ‌ర్‌ని తిర‌స్క‌రించిన బ‌న్నీని చూసి నోరెళ్ల‌బెట్టార‌ట స‌ద‌రు ఎన్నారైలు. ఒక సినిమాలో న‌టిస్తే కూడా రాని మొత్తం ఐదారు రోజుల్లో వ‌చ్చేస్తుంటే బ‌న్నీని కాద‌నుకోవ‌డం చిత్ర‌మే క‌దూ! కానీ బ‌న్నీకి మాత్రం ప‌ర్ప‌స్ లేకుండా క‌మ‌ర్షియ‌ల్‌గా ఆలోచించి అలా డ్యాన్సులేయ‌డం న‌చ్చ‌ద‌ట‌. అందుకే సింపుల్‌గా నో అని చెప్పేశాడు. ఇంకా బ‌న్నీ అయినా క‌మ‌ర్షియ‌ల్ యాడ్లు గ‌ట్రా చేస్తుంటాడు కానీ... ప‌వ‌న్‌క‌ల్యాణ్ అయితే అవి కూడా చేయ‌డు. క‌మ‌ల్‌హాస‌న్ కూడా అంతే. సినిమా కోసం, ఛారిటీ కోసం త‌ప్ప ఏ యాడ్స్‌లోనూ న‌టించ‌లేదు. అయినా ఒకొక్క న‌టుడికి ఒక్కో పాల‌సీ ఉంటుంది. ఆప్ర‌కార‌మే ముందుకెళుతుంటారు. అదే బాలీవుడ్‌లో అయితే షారుఖ్‌ఖాన్‌లాంటి అగ్ర క‌థానాయ‌కుడు పెళ్లిళ్ల‌లోనూ ఆడిపాడి వ‌స్తుంటాడు. 


Loading..
Loading..
Loading..
advertisement