ఆంధ్ర సోగ్గాడికి అత్యంత భారీ రక్షణ..!!

Wed 17th Jun 2015 04:17 AM
shobhan babu,statue,tamilnadu,police  ఆంధ్ర సోగ్గాడికి అత్యంత భారీ రక్షణ..!!
ఆంధ్ర సోగ్గాడికి అత్యంత భారీ రక్షణ..!!
Sponsored links

తమిళనాట 'శోభన్‌బాబు'కి రక్షణ కరువైంది. ఆంధ్రుల అందాల హీరోగా వెలుగొందిన శోభన్‌బాబు చెన్నైలోని స్థిరపడ్డ విషయం తెలిసిందే. అక్కడే కాలధర్మం చేసిన శోభన్‌బాబుకు గుర్తుగా చెన్నైలో ఆయన ఇంటికి ఎదురుగా ఓ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే తమిళ వేర్పేటువాదులు శోభన్‌బాబు విగ్రహంపై పగబట్టారు. ఈ విగ్రహాన్ని కూల్చివేయడానికి సోమవారం ప్రయత్నించిన 30 మంది వేర్పేటువాదులను పోలీసులు అరెస్టు చేశారు.

ప్రస్తుతం శోభన్‌బాబు విగ్రహానికి భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. శోభన్‌బాబు విగ్రహం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి విగ్రహం వద్దకు ఎవరూ రాకుండా జాగ్రత్తపడుతున్నారు. మరోవైపు శోభన్‌బాబు కుమారుడు కరుణశేషుకు పలు తెలుగు సంఘాలు బాసటగా నిలిచాయి. ఇక ఒకప్పుడు శోభన్‌బాబు ప్రియురాలిగా పేరుపొందిన జయలలిత ఈ విగ్రహానికి భారీ రక్షణ ఏర్పాట్లు చేయాల్సిందిగా పోలీసులును ఆదేశించినట్లు సమాచారం. ఇక తన సినీ జీవితంలో.. ఆ తర్వాత కూడా ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా జీవించిన శోభన్‌బాబు ప్రతిష్టకు ఇప్పుడు వేర్పేటువాదుల కారణంగా మచ్చ ఏర్పడుతుండటం బాధాకరమే.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019