చ‌ర‌ణ్ ఫుల్ హ్యాపీ..!

Wed 17th Jun 2015 04:21 AM
ram charan,ram charan happy,ram charan news movie shoot,srinu vaitla,d v vdanayya,raku preeth singh  చ‌ర‌ణ్ ఫుల్ హ్యాపీ..!
చ‌ర‌ణ్ ఫుల్ హ్యాపీ..!
Sponsored links
కొత్త సినిమా విష‌యంలో చ‌ర‌ణ్ హ్యాపీగా ఉన్నాడు. మా టీమ్ ఎన‌ర్జీ చూస్తుంటే ముచ్చ‌టేస్తోంద‌నీ, ఇలాంటి సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంద‌ని ఫేస్‌బుక్ ద్వారా వ్యాఖ్యానించాడు చ‌ర‌ణ్‌. ప్ర‌స్తుతం శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ విత్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకొంటున్న ఈసినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకొంటోంది. ఇటీవ‌ల ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో వ‌చ్చే యాక్ష‌న్‌తో పాటు, రెండు పాట‌ల్ని, కొన్ని స‌న్నివేశాల్ని చిత్రీక‌రించారు. ఆ స‌న్నివేశాలపై చ‌ర‌ణ్ సంతోషంగా ఉన్నాడు. ``సినిమా చాలా బాగా వ‌స్తోంద‌నీ, కొత్త టీమ్ విష‌యంలో వంద‌శాతం సంతృప్తిగా ఉన్నాన‌``ని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు చ‌ర‌ణ్‌. ఈసినిమాకి `మై నేమ్ ఈజ్ రాజు`, `బ్రూస్‌లీ` అనే పేర్లు ప్ర‌చారంలో ఉన్నాయి. ఇందులో చెర్రీ ఫైట‌ర్‌గా క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. ర‌కుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక‌గా న‌టిస్తోంది. అక్టోబ‌రులో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డమే ల‌క్ష్యంగా చిత్రాన్ని శ‌ర‌వేగంగా తెర‌కెక్కిస్తున్నారు. 
Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019