Advertisementt

బాలయ్య హీరోయిన్‌తో అబ్బాయి రొమాన్స్!

Thu 23rd Apr 2015 03:00 AM
balakrishna,kalyanram,sonal chauhan,pataas,legend heroine  బాలయ్య హీరోయిన్‌తో అబ్బాయి రొమాన్స్!
బాలయ్య హీరోయిన్‌తో అబ్బాయి రొమాన్స్!
Advertisement
Ads by CJ

పటాస్ విజయం తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'షేర్'. ఈ చిత్రంలో కథానాయికగా మొదట 2012 మిస్ ఇండియా వరల్డ్ వన్యా మిశ్రాను ఎంపిక చేశారు. అయితే, ఇప్పుడామె స్థానంలో సోనాల్ చౌహాన్ ను తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. గత ఏడాది బాలకృష్ణ 'లెజెండ్'తో తెలుగులో సోనాల్ ఘన విజయాన్ని అందుకుంది. లెజెండ్ తర్వాత పండగ చేస్కో, అనుష్క సైజ్ జీరో చిత్రాల్లో అవకాశాలు ఆమెను వరించాయి. తాజాగా కళ్యాణ్ రామ్ 'షేర్' ఆమె ఖాతాలో చేరింది. ముంబై ముద్దుగుమ్మకు బాలయ్య హ్యాండ్ బాగా కలిసొచ్చింది.     

పటాస్ విజయంతో నందమూరి కళ్యాణ్ రామ్ మార్కెట్ బాగా పెరిగింది. ఇటువంటి సమయంలో కొత్తమ్మాయి కంటే ఫేమస్ హీరోయిన్ అయితే బెటర్ అని చిత్ర బృందం భావించింది. దర్శకుడు సోనాల్ చౌహాన్ ను కలిసి కథ, ఆమె క్యారెక్టర్ గురించి వివరించారు. చిత్రంలో నటించడానికి ఆమె ఆసక్తిని కనబరిచింది. ఇంకా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టలేదని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ