Advertisement

నాగశౌర్య ఫస్ట్‌ యాక్షన్‌ మూవీ ‘జాదూగాడు’ ఆడియో

Tue 21st Apr 2015 11:08 PM
jadugadu audio,nagashowrya,yogesh,sagar mahathi  నాగశౌర్య ఫస్ట్‌ యాక్షన్‌ మూవీ ‘జాదూగాడు’ ఆడియో
నాగశౌర్య ఫస్ట్‌ యాక్షన్‌ మూవీ ‘జాదూగాడు’ ఆడియో
Advertisement

నాగశౌర్య, సోనారిక జంటగా సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యోగేష్‌ దర్శకత్వంలో వి.వి.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘జాదూగాడు’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ మంగళవారం హైదరాబాద్‌లోని తాజ్‌ డెక్కన్‌ హోటల్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు సాగర్‌ మహతి సంగీత సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో మ్యాంగో మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ ఆడియో బిగ్‌ సి.డి.ని మణిశర్మ ఆవిష్కరించారు. మణిశర్మ, బి.గోపాల్‌, కోన వెంకట్‌, గోపీచంద్‌ మలినేని, నల్లమలుపు శ్రీనివాస్‌ సంయుక్తంగా ఆడియో సీడీలను ఆవిష్కరించారు. సీడీలను మణిశర్మ వేదికపై వున్న అతిథులకు, యూనిట్‌ సభ్యులకు అందించారు. 

మణిశర్మ: నేను స్టేజ్‌ మీద ఎప్పుడూ మాట్లాడిరది లేదు. కానీ, ఈ విషయంలో సాగర్‌ నన్ను మించిపోయాడు. ఆల్‌ ది వెరీ బెస్ట్‌ టు జాదూగాడు టీమ్‌ అండ్‌ సాగర్‌. 

కోన వెంకట్‌: నేను, ఈ సినిమా ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌ ఒకటే ప్లాట్‌ఫామ్‌ నుంచి వచ్చినవాళ్ళం. రామ్‌గోపాల్‌వర్మ అనే ఒక హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి బయలుదేరాం. మా యోగికి ఒక రికార్డ్‌ వుంది. సినిమా, సినిమాకి హయ్యస్ట్‌ గ్యాప్‌ తీసుకునే ఏకైక డైరెక్టర్‌ అతనే. అతని లాస్ట్‌ మూవీ 2008లో వచ్చిన ‘చింతకాయల రవి’. ఈ గ్యాప్‌లో అతను ఖాళీగా వుండడు. ప్రతిరోజూ వర్క్‌ చేస్తుంటాడు. ఇంత గ్యాప్‌తో యోగి చేసిన ఈ సినిమాలో ఏదో జాదూ వుందని మాత్రం చెప్పగలను. 

ఎ.రమేష్‌ప్రసాద్‌: యాభై సంవత్సరాల నుంచి మేం సినిమాకి రిలేట్‌ అయ్యాం. అందుకే సినిమాకి సంబంధించిన ఏ ప్రోగ్రామ్‌ అయినా మాకు ఇంట్రెస్ట్‌గా వుంటుంది. నాగశౌర్య ఒక కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. యోగి ఏడు సంవత్సరాలు గ్యాప్‌ తీసుకున్నా చాలా మంచి సినిమా తీసి వుంటాడు. అలాగే ఈ సినిమా ద్వారా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న సాగర్‌కి బెస్ట్‌ విషెస్‌ తెలియజేస్తున్నాను. 

బి.గోపాల్‌: ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా వుంది. ఎందుకంటే నాకు ఎంతో ఇష్టమైన మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మగారు. నేను చేసిన సినిమాలకు పాటలతో, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో ప్రాణం పోశాడు. ఆ సినిమాలు అంత పెద్ద హిట్‌ కావడంలో మణిశర్మగారు ముఖ్యపాత్ర పోషించారు. వాళ్ళబ్బాయి ఫస్ట్‌టైమ్‌ మ్యూజిక్‌ చేస్తున్నాడు. మణిశర్మ అంత పెద్ద మ్యూజిక్‌ డైరెక్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్‌ అయి నాగశౌర్యకి, యోగికి, ప్రసాద్‌గారికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. 

నందినిరెడ్డి: టైటిల్‌ జాదూగాడు అనిపెట్టారు. జాదూగాళ్ళు అని పెడితే బాగుండేది. ఎందుకంటే యోగి, సాగర్‌, నాగశౌర్య ఈ ముగ్గురు జాదూగాళ్ళే. ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. 

కళ్యాణి మాలిక్‌: 2003లో నా మొదటి సినిమా రిలీజ్‌ అయింది. ఆరోజు నేను ఎంత ఎక్సైట్‌ అయ్యానో, ఈరోజు అంత ఎక్సైట్‌ అవుతున్నాను. ఎందుకంటే ఈ సినిమా నా సినిమాగా భావిస్తున్నాను. సాగర్‌ నాకు చాలా క్లోజ్‌ ఫ్రెండ్‌. నా పాటలు ఎంత పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటానో, సాగర్‌ చేసిన పాటలు కూడా అంత పెద్ద హిట్‌ అవ్వాలని ఆశిస్తున్నాను. 

మెహర్‌ రమేష్‌: యోగి నాకు మంచి ఫ్రెండ్‌. పోకిరిలో డైలాగ్‌లా ఎంత గ్యాప్‌తో సినిమా తీశామన్నది కాదన్నయ్యా ఎలాంటి తీసామన్నది ఇంపార్టెంట్‌. సినిమాని ఇరగదీశాడు. గ్యాప్‌ తీసుకొని చేసినా కలర్‌ఫుల్‌గా తీశాడు, నాగశౌర్యని చాలా బాగా ప్రెజెంట్‌ చేశాడు. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది. 

దామోదర ప్రసాద్‌: ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరితో నాకు రిలేషన్‌ వుంది. సాగర్‌ అలా మొదలైంది సినిమా చేస్తున్నప్పటి నుంచి మా సినిమాల్లో పార్ట్‌ అయ్యాడు. నాగశౌర్య వాళ్ళ నాన్న కూడా నాకు మంచి ఫ్రెండ్‌. ఈ సినిమా ఆడియో, సినిమా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను. 

నాగశౌర్య: నన్ను హీరోగా అనుకొని కొంచెం బడ్జెట్‌ ఎక్కువైనా ఫర్వాలేదు అని నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ప్రసాద్‌గారికి, డైరెక్టర్‌ యోగిగారికి మనస్ఫూర్తిగా థాంక్స్‌ చెప్తున్నాను. నన్ను నమ్మి సినిమా తీసే ప్రతి నిర్మాత నాకు దేవుడుతో సమానం. అలాగే నాతో పనిచేసిన టెక్నీషియన్స్‌ నాకు దేవుళ్ళతో సమానం. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడి ఫిల్మ్‌నగర్‌లో ఓపెన్‌ చేసిన ప్రతి ఆఫీస్‌లో ఫోటోలు ఇచ్చాను. పిలిచిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పెర్‌ఫార్మ్‌ చేశాను. ఆ వాల్యూ ఏమిటో నాకు బాగా తెలుసు. ముఖ్యంగా నా ఫస్ట్‌ మూవీ నిర్మాత సాయి కొర్రపాటిగారికి, అవసరాల శ్రీనివాస్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా విషయానికి వస్తే మా డైరెక్టర్‌గారి కసి, మా మధుగారి కథ, శ్రీరామ్‌గారి విజువల్స్‌, సాగర్‌గారి మ్యూజిక్‌, అందమైన కోస్టార్‌.. వీళ్ళంతా కలవడం వల్ల ఒక మంచి మూవీ రెడీ అయింది. ఈ సినిమా ద్వారా ఫస్ట్‌ టైమ్‌ లవ్‌ ఇమేజ్‌ నుంచి మారి మాస్‌ యాక్షన్‌ మూవీ చేస్తున్నాను. మీ అందరూ నన్ను బ్లెస్‌ చేస్తే మరో స్టెప్‌ ముందుకెళ్తాను. మరోసారి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 

సోనారిక: యోగేష్‌గారు, ప్రసాద్‌గారు నాకు ఈ అవకాశం ఇవ్వడం చాలా గ్రేట్‌గా ఫీల్‌ అవుతున్నాను. శౌర్య అమేజింగ్‌ కో యాక్టర్‌. ఈ సినిమాకి చాలా మంచి పాటలు ఇచ్చిన సాగర్‌కి వెరీ థాంక్స్‌. ఈ సినిమాని మేమంతా ఎంతో కష్టపడి చేశాం. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. 

సాగర్‌ మహతి: మా సినిమా ఆడియో ఫంక్షన్‌కి వచ్చి నన్ను, మా యూనిట్‌ బ్లెస్‌ చేసిన అందరికీ ధన్యవాదాలు. ఎంతో మంది గొప్ప వారు పనిచేసిన ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈరోజు నుంచి నేను కూడా ఒక భాగంగా వుండడం చాలా గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. నేను ఒక మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఇప్పుడు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారకులు మా తాతగారు. ఆయన లేకపోతే మా బ్లడ్‌లో మ్యూజిక్‌ అనేదే వుండేది కాదు. ఎన్ని జన్మలకైనా ఆ రుణం తీర్చుకోలేనిది. నాన్నగారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు ఇంత మంచి మ్యూజిక్‌ లైఫ్‌ని ఇచ్చిన నాన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాగశౌర్య ఈ సినిమాలో ఎక్స్‌ట్రార్డినరీగా చేశాడు. యోగేష్‌ చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. 

నాగశౌర్య, సోనారిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, కాశీ విశ్వనాథ్‌, మాధవి, అజయ్‌, శ్రీనివాసరెడ్డి, పృథ్వి, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, జాకీర్‌ హుస్సేన్‌, ఆశిష్‌ విద్యార్థి, రవి కాలే, ప్రభాస్‌ శ్రీను తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్‌, సంగీతం: సాగర్‌ మహతి, ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ, ఆర్ట్‌: సాహి సురేష్‌, ఫైట్స్‌: వెంకట్‌, కథ, మాటలు: మధుసూదన్‌, పాటలు: వరికుప్పల యాదగిరి, శ్రీమని, విశ్వ, నిర్మాత: వి.వి.ఎన్‌.ప్రసాద్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: యోగేష్‌. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement