Advertisement

సినీజోష్‌ రివ్యూ: కాలా

Fri 08th Jun 2018 01:55 PM
tleugu movie kaala,kaala movie review,kaala movie review in cinejosh,kaala cinejosh review,rajnikanth latest movie kaala,pa ranjith new movie kaala  సినీజోష్‌ రివ్యూ: కాలా
telugu movie kala review సినీజోష్‌ రివ్యూ: కాలా
సినీజోష్‌ రివ్యూ: కాలా Rating: 2.75 / 5
Advertisement

వండర్‌బార్‌ ఫిలింస్‌ 

కాలా 

తారాగణం: రజనీకాంత్‌, నానా పాటేకర్‌, సంపత్‌రాజ్‌, సముద్రఖని, అంజలి పాటిల్‌, ఈశ్వరీరావు, హ్యూమా ఖురేషి, షాయాజీ షిండే తదితరులు 

సినిమాటోగ్రఫీ: మురళి జి. 

ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌ 

సంగీతం: సంతోష్‌ నారాయణన్‌ 

నిర్మాత: ధనుష్‌ 

రచన, దర్శకత్వం: పా.రంజిత్‌ 

విడుదల తేదీ: 07.06.2018 

రజనీకాంత్‌కి ప్రపంచవ్యాప్తంగా చాలా ఫాలోయింగ్‌ ఉంటుంది. రజనీ కొత్త సినిమా వస్తోందంటే అంచనాలు భారీగానే ఉంటాయి. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను మించి సినిమా ఉంటే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుంది. అలా కాకుండా వారి అంచనాలను అందుకోలేకపోతే సినిమా ఎలా ఉన్నా పరాజయం తప్పదు. పా. రంజిత్‌ దర్శకత్వంలో రజనీ చేసిన కబాలి విషయంలో అదే జరిగింది. విడుదల సమయంలో ఆ సినిమాకి వచ్చిన హైప్‌ ఆకాశాన్నంటింది. అయితే కబాలి ఆశించిన విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ రంజిత్‌కే మళ్ళీ అవకాశం ఇచ్చి కాలా చిత్రం చేశాడు రజనీ. ఈ చిత్రాన్ని ధనుష్‌ నిర్మించడం విశేషం. మొదట ప్రకటించిన తేదీ కంటే చాలా ఆలస్యంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కబాలి ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకోవడంతో సహజంగానే కాలా మీద ఎక్స్‌పెక్టేషన్స్‌ తగ్గాయి. ఈ గురువారం విడుదలైన కాలా చిత్రంలో ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఉన్నాయా? ఎంతవరకు ఈ సినిమా ఆకట్టుకుంది? రజనీ, రంజిత్‌ కాంబినేషన్‌ ఈసారి సూపర్‌హిట్‌ సినిమాని అందించగలిగిందా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

తమిళనాడులో తనకున్న ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ఆమధ్య రజనీ ప్రకటించిన విషయం తెలిసిందే. కాలా చిత్ర కథాంశం కూడా అలాంటిదే ఎంచుకోవడం విశేషం. ముంబైలోని ధారావి ఏరియాలో అన్ని భాషల వారు, అన్ని ప్రాంతాలవారు ఉంటారు. ఏషియాలోనే అతి పెద్ద స్లమ్‌ ఏరియాగా పేరు తెచ్చుకున్న ధారావిలో కాలా(రజనీకాంత్‌) తిరుగులేని నాయకుడు. తన కనుసైగతో జనంలో చైతన్యం తీసుకురాగల సత్తా ఉన్నవాడు. ఎంతో విస్తీర్ణంతో నగరం నడిబొడ్డున ఉన్న ధారావిపై కబ్జాదారుల కన్నుపడుతుంది. రాజకీయ నాయకుడైన హరిదాదా(నానా పాటేకర్‌) ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తెచ్చుకొని తన వ్యాపారాలను విస్తరించుకోవాలని ఆశపడతాడు. అందుకోసం కంటితుడుపుగా అక్కడ ఉన్నవారికి ఫ్లాట్స్‌ కట్టిస్తానని నమ్మబలుకుతాడు. ఇదంతా నచ్చని కాలా హరిదాదా ప్రపోజల్‌కి అడ్డు చెబుతాడు. అలా వారిద్దరి మధ్య వైరం పెరుగుతుంది. కాలాని మట్టుపెట్టాలని హరిదాదా విశ్వప్రయత్నాలు చేస్తాడు. ఫలితంగా కాలా కుటుంబానికి నష్టం జరుగుతుంది. అప్పుడు తమ ప్రాంతాన్ని, తమ నేలని కాపాడుకోవడానికి కాలా ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? హరిదాదా ఆట ఎలా కట్టించాడు? అనేది మిగతా కథ. 

రజనీకాంత్‌, నానా పాటేకర్‌ల నటన సినిమాని ఒక రేంజ్‌కి తీసుకెళ్లింది. ఇంటర్వెల్‌ బ్లాక్‌లో వీరిద్దరి మధ్య వచ్చే సీన్‌ సినిమాకి హైలైట్‌ అయిందని చెప్పొచ్చు. ఎంతో నేచురల్‌ లుక్‌తో ఓల్డ్‌ గెటప్‌లో రజనీ పెర్‌ఫార్మెన్స్‌ సూపర్బ్‌ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో రజనీ మూమెంట్స్‌ ఫ్యాన్స్‌ చేత విజిల్స్‌ కొట్టించకమానవు. ఫైట్స్‌లో, ఎమోషనల్‌ సీన్స్‌లో, స్టైల్‌లో ఏమాత్రం స్పీడ్‌ తగ్గలేదని రజనీ మరోసారి ప్రూవ్‌ చేసుకున్నాడు. హరిదాదాగా నానా పాటేకర్‌ నటన ఎంతో డిగ్నిఫైడ్‌గా ఉంది. తన క్యారెక్టర్‌కి తనే డబ్బింగ్‌ చెప్పుకోవడం విశేషం. మిగతా క్యారెక్టర్స్‌లో కాలా భార్యగా ఈశ్వరీరావు పెర్‌ఫార్మెన్స్‌ స్లమ్‌ ఏరియాకు తగ్గట్టుగా ఎంతో నేచురల్‌గా ఉంది. మిగతా క్యారెక్టర్స్‌లో సంపత్‌రాజ్‌, సముద్రఖని, అంజలి పాటిల్‌ కూడా మంచి పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారు. 

సాంకేతికంగా చూస్తే మురళి ఫోటోగ్రఫీ ఎంతో నేచురల్‌గా అనిపిస్తుంది. అబ్బుర పరిచే విజువల్స్‌ లేకపోయినా ప్రతి సీన్‌ని చాలా సహజంగా చిత్రీకరించడంలో మురళి సక్సెస్‌ అయ్యాడు. కబాలి చిత్రానికి మంచి సంగీతాన్ని అందించిన సంతోష్‌ నారాయణన్‌ ఈ సినిమాకి దాన్ని మించిన రేంజ్‌లో మ్యూజిక్‌ చేశాడు. ముఖ్యంగా స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ అతను చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ప్రతి సీన్‌ని ఎలివేట్‌ చేశాయి. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ బాగానే ఉన్నా నిడివి సమస్య సినిమాలో ప్రధానంగా కనిపించింది. ఫస్ట్‌ హాఫ్‌లో స్లో నేరేషన్‌ సినిమాకి బాగా మైనస్‌ అయింది. కొన్ని అనవసర సీన్స్‌ను కట్‌ చేసి ఉంటే సినిమా స్పీడ్‌ అయ్యేది. నిర్మాత ధనుష్‌ ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా నిర్మించాడు. దర్శకుడు రంజిత్‌ గురించి చెప్పాలంటే కబాలి కంటే ఎన్నో రెట్లు అద్భుతంగా కాలా చిత్రాన్ని రూపొందించాడు. రజనీ నుంచి ప్రేక్షకులు, అభిమానులు ఏం ఆశిస్తున్నారనే విషయాన్ని గ్రహించిన రంజిత్‌ వారితో విజిల్స్‌ వేయించేలా కొన్ని సీన్స్‌ తీశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌ బ్లాక్‌ ప్రతి ఒక్కరికీ అద్భుతం అనిపిస్తుంది. అలాగే స్టేషన్‌లో కాలాని ఇంటరాగేట్‌ చేసే సీన్‌, క్లైమాక్స్‌లో విలన్‌ని అంతమొందించే సన్నివేశాన్ని కూడా అద్భుతంగా చితీక్రరించారు. రజనీకాంత్‌, నానా పాటేకర్‌ నటన, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, నేచురల్‌గా అనిపించే సన్నివేశాలు, ఇంటర్వెల్‌ బ్లాక్‌ సినిమాకి ప్లస్‌ ప్లాయింట్స్‌ కాగా, సినిమా నిడివి, రజనీ, హ్యూమా లవ్‌ ట్రాక్‌, అతిగా అనిపించే కొన్ని సన్నివేశాలు సినిమాకి మైనస్‌గా మారాయి. ఫైనల్‌గా చెప్పాలంటే రజనీకాంత్‌, రంజిత్‌ కాంబినేషన్‌లో వచ్చిన కబాలి కంటే ఎన్నో రెట్లు బెటర్‌గా కాలా సినిమా ఉంటుంది. తెలుగు, కంటే తమిళ్‌లోనే ఈ సినిమా కమర్షియల్‌గా వర్కవుట్‌ అయ్యే అవకాశం ఉంది. కబాలి చిత్రాన్ని చూసి నిరాశ చెందిన ప్రేక్షకులకు, అభిమానులకు కాలా ఒక డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌నిస్తుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: కబాలి కంటే ఎన్నో రెట్లు బెటర్‌గా కాలా

telugu movie kala review :

rajnikanth and pa.ranjith combo movie kaala


Loading..
Loading..
Loading..
advertisement