ఆసక్తికరమైన టైటిల్ తో వస్తున్న వరుణ్ తేజ్!

Fri 08th Jun 2018 09:37 AM
hero varuntej,new movie,antariksham,sankalp reddy  ఆసక్తికరమైన టైటిల్ తో వస్తున్న వరుణ్ తేజ్!
Varun Tej's New Film Antariksham ఆసక్తికరమైన టైటిల్ తో వస్తున్న వరుణ్ తేజ్!
Sponsored links

వరుణ్ తేజ్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఫిదా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ తొలిప్రేమతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. రెండు సినిమాల హిట్స్ తో దూసుకుపోతున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం ఘాజి ఫేమ్ సంకల్ప్ రెడ్డితో ఒక సినిమాని, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ తో కలిసి 'ఎఫ్ 2' అనే మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. ఒకే టైంలో వరుణ్ తేజ్ ఈ రెండు సినిమాలను పూర్తి చేయనున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలు పట్టాలెక్కేశాయి. అయితే సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో వరుణ్ తేజ్ నటించబోయే సినిమాలో వరుణ్ తేజ్ వ్యోమగామిగా నటిస్తున్నాడు.

సైన్స్‌ఫిక్షన్ నేపథ్యంలో స్పేస్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ గా అంతరిక్షం అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాత రాజీవ్‌రెడ్డి ఈ టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేసినట్టు సమాచారం అందుతుంది. మరి ఫిదా, తొలిప్రేమ సినిమాల్లో లవర్ బాయ్ లా అదరగొట్టిన వరుణ్ తేజ్ ఇప్పుడు వ్యోమగామిగా అంతరిక్షంలో ఎలా అదరగొడతాడో చూడాలి. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ సమ్మోహనం ఫేమ్ అదితి రావు తోనూ లావణ్య త్రిపాఠీ తోనూ రొమాన్స్ చేయనున్నాడు. ఇక లావణ్య త్రిపాఠి తో కలిసి వరుణ్ తేజ్ ఇప్పటికే... మిస్టర్ సినిమాలో నటించాడు.

Sponsored links

Varun Tej's New Film Antariksham:

Space Level Title for Varun Tej Film

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019