రాజమౌళి - రామోజీ .. ఏంటి వార్తలు?

Fri 08th Jun 2018 02:12 PM
rajamouli,ramoji rao,gossips,angry  రాజమౌళి - రామోజీ .. ఏంటి వార్తలు?
Baahubali Producer Angry on Gossip News రాజమౌళి - రామోజీ .. ఏంటి వార్తలు?
Sponsored links

టాలీవుడ్ లో బాహుబలి సినిమాతో టాప్ చైర్ ఎక్కేసిన డైరెక్టర్ రాజమౌళితో సినిమాలు చేసేందుకు ఒక్క హీరోలు మాత్రమే కాదు.. నిర్మాతలు కూడా ఎగబడే పరిస్థితి ఉంది. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చెయ్యబోతున్నాడు. ఆ మల్టీస్టారర్ విషయంలో రాజమౌళి పేరు మాములుగా మార్మోగిపోవడం లేదు. అయితే ఇప్పుడు రాజమౌళి పేరు మరోరకంగా వార్తల్లోకెక్కింది. అదేమిటంటే ఈనాడు అధిపతి రామోజీరావుతో రాజమౌళికి విభేదాలు అనే టాక్ వినబడుతుంది. ఆ విభేదాలు కూడా ఒక రేంజ్ లో ఉన్నాయని.... వారి మధ్యన ఆర్థికపరమైన కారణాలు తీవ్ర స్థాయిలో ఉన్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి.

ఆ కారణంగానే రాజమౌళి రామోజీ ఫిల్మ్ సిటీలో తన సినిమా షూటింగ్స్ చేయరాదని నిశ్చయించుకున్నట్టుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అసలు రాజమౌళికి ఈ స్థాయిలో రామోజీ మీద కోపం రావడానికి అసలు కారణాలు కూడా సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. బాహుబలి సినిమా పార్ట్ 1, పార్ట్ 2 ని రాజమౌళి రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ వేసి మరీ చాలా భాగం షూటింగ్ జరిపాడు. అలాగే అక్కడ షూటింగ్ జరిపినందుకు గాను.... బాహుబలికి సంబందించిన శాటిలైట్ హక్కులను  రామోజీకి సంబందించిన ఈటివి ఛానల్ కి ఇస్తున్నట్టుగా అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ అనూహ్యంగా బాహుబలి శాటిలైట్ హక్కులను ఆర్కా మీడియా వారు స్టార్ మా ఛానల్ కి ఇచ్చేశారు. అయితే రామోజీఫిల్మ్ సిటీలో వేసిన బాహుబలి సెట్స్ లో ఆర్కా మీడియా వారు సీరియల్స్ కూడా చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు బాహుబలి షూటింగ్ కోసం రామోజీఫిల్మ్ సిటీని వాడుకున్నందుకు గాను 90కోట్ల రూపాయల బిల్లు రామోజీ సంస్థలు ఆర్కా మీడియా వారికి పంపడంతోనే ఈ వివాదం తలెత్తినట్లుగా ప్రచారం జరుగుతుంది. 

అయితే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు హర్ట్ అయిన రాజమౌళి ఇక ఫ్యూచర్ లో తన సినిమాలేవీ రామోజీ ఫిల్మ్ సిటీలో చెయ్యనని శపధం చేసినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి వార్తలను కావాలనే రామోజీ అండ్ కో లీక్ చేసినట్లుగా రాజమౌళి భావిస్తుండడంతోనే.. రాజమౌళి ఇలాంటి డెసిషన్ తీసుకున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదంటున్నారు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ. కొన్ని వెబ్సైట్ లో ఇలాంటి అసత్య వార్తలు ప్రచారం చేసి వ్యూస్ సంపాదించుకుంటున్నారని... ఇలాంటి ఆధారం లేని న్యూస్ లు ప్రచురించవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరి నిజంగానే నిప్పులేకుండా పొగ అనేది బయటికి రాదుకదా... రాజమౌళి-రామోజీ విషయంలో ఏదో జరగబట్టే ఇలాంటి న్యూస్ లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతాయి అని అంటున్నారు.

Sponsored links

Baahubali Producer Angry on Gossip News:

No War Between Rajamouli and Ramoji Rao

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019