Advertisementt

అల్లు అర్జున్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా

Wed 29th Apr 2026 01:14 PM
allu arjun  అల్లు అర్జున్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా
will Allu Arjun Plans Work అల్లు అర్జున్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా
Advertisement
Ads by CJ

 

పుష్ప సీరీస్ కోసం ఐదేళ్లపాటు స్పెండ్ చేసిన అల్లు అర్జున్ మరో రెండేళ్లు తీసుకుని  పుష్ప 3 చేసేందుకు సిద్ధంగా కనిపించలేదు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో రాకా స్టార్ట్ చేసారు. ఆ చిత్రం షూటింగ్ మొదలై ఏడాది కావొస్తుంది. మరో ఏడాది పైనే రాకా కోసం సమయం వెచ్చించాల్సి ఉంది. కాబట్టే అల్లు అర్జున్-అట్లీ రాకా రిలీజ్ డేట్ లాక్ చేయలేదు.

అయితే తాజాగా అల్లు అర్జున్ తన తో సినిమాలు చెయ్యబోయే దర్శకులకు స్ట్రీట్ గా కొన్ని నిబంధనలు పెట్టారట. రాకా తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ తో సినిమా చెయ్యాల్సిఉంది. అయితే  అల్లు అర్జున్ దర్శకులకు పెట్టిన నిబంధనలు ఏమంటే.. ప్రతి సినిమాకి 200 రోజుల కాల్షీట్స్ ఇచ్చి షూటింగ్ చెయ్యాలని, ఒకవేళ అనుకున్న సమయానికి పూర్తి కాకపోతే దానితో పాటుగా మరో ప్రాజెక్ట్ మొదలు పెట్టె అవకాశం ఉందట.

అసలు టైమ్ వేస్ట్ చెయ్యకుండా ఈ ప్లాన్‌తో షెడ్యూల్స్‌ను సక్రమంగా నిర్వహిస్తూ, తన ఔట్‌పుట్‌ను పెంచాలని అల్లు అర్జున్ భావిస్తున్నారట. మరి అలా అయితే రాకా ఫినిష్ కాకముందే అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ సినిమా మొదలు పెట్టె ఛాన్స్ కనిపిస్తుంది. చూద్దాం అల్లు అర్జున్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అనేది. 

 

మెల్లగా విశ్వంభర ను మర్చిపోతారేమో

మెగాస్టార్ విశ్వంభర విడుదల తేదీ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూపులు ఫలించేలా లేవు. వసిష్ఠ దర్శకత్వంలో చిరు నటించిన విశ్వంభర సీజీ వర్క్ కంప్లీట్ అవుతుంది, అందులో నుంచి ట్రైలర్ కట్ అంటూ ఏవేవో న్యూస్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినా విశ్వంభర మేకర్స్ మాత్రం ఆ మౌనాన్ని వీడలేదు.

అటు రిలీజ్ డేట్ ఇవ్వరు, ఇటు ప్రమోషన్స్ మొదలు పెట్టరు. ట్రైలర్ అన్నా అది ఇవ్వట్లేదు. మరి మెల్లగా విశ్వంభర పై ఉన్న క్రేజ్ తగ్గిపోతుంది కాదు ఆల్రెడీ తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో విశ్వంభర ట్రైలర్ ఊపు తెస్తుంది అంటూ ఊదరగొట్టారు. కానీ ఇప్పుడు ఆ ఊసే లేదు.

ఇకపై విశ్వంభర అప్ డేట్స్ వచ్చినా అవి ఎంత వైరల్ అవుతాయో అనే విషయంలో మెగా ఫ్యాన్స్ లో సందేహాలు పీక్స్ కి చేరుకున్నాయి. మెల్లగా విశ్వంభరను ఆడియన్స్ మర్చిపోయి ఎక్కడ లైట్ తీసుకుంటారో అనేది మెగా ఫ్యాన్స్ భయం. 

will Allu Arjun Plans Work:

Allu Arjun New Plans For His Next projects

Tags:   ALLU ARJUN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ