Advertisementt

స్వీటీ అనుష్క మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్నెల్

Mon 23rd Feb 2026 04:43 PM
anushka shetty  స్వీటీ అనుష్క మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్నెల్
Anushka shetty signed her second mollywood project స్వీటీ అనుష్క మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్నెల్
Advertisement
Ads by CJ

`ఘాటీ` త‌ర్వాత స్వీటీ అనుష్క మ‌ళ్లీ టాలీవుడ్ లో మ‌రో చిత్రానికి క‌మిట్ అవ్వ‌ని సంగ‌తి తెలిసిందే. భారీ అంచనాల మ‌ధ్య రిలీజ్ అయిన `ఘాటీ` వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. దీంతో అనుష్క కూడా సైలైంట్ గానే ఉంది. వాస్త‌వానికి `ఘాటీ` షూటింగ్ వ‌ర‌కే అనుష్క ప‌రిమిత‌మైంది. ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్ర‌చార కార్య‌క్ర‌మంలో పాల్గొన‌ని సంగ‌తి తెలిసిందే.

 

అలా అనుష్క సైలెన్స్ టాలీవుడ్ లో హైలైట్ అయింది. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే ప్ర‌స్తుతం మాలీవుడ్ లో అమ్మ‌డు లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. `క‌థ‌నార్:  ది వైల్డ్ సార్స‌ర్` చిత్రంతో ఎంట్రీ ఇస్తోంది. జ‌య‌సూర్య‌, మోహ‌న్ లాల్, ప్ర‌భుదేవా లాంటి స్టార్లు మెయిన్ లీడ్ పోషించ‌గా, ఫీమేల్ లీడ్ లో అనుష్క క‌నిపించ‌నుంది.

 

ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా వాళ్లంద‌ర్నీ ప‌క్క‌న బెట్టి మ‌రీ అనుష్క‌ను తీసుకున్నారు. 100 కోట్ల బ‌డ్జెట్ ప్రాజెక్ట్ ఇది. త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముంద‌కు రానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే అమ్మ‌డు మాలీవుడ్ లో రెండ‌వ చిత్రానికి సైన్ చేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. `మంజుమ్మ‌ల్ బోయ్స్` ద‌ర్శ‌కుడు షైజు ఖ‌లీద్ అనుష్క‌ను ఓ సినిమాకు ఎంపిక చేసిన‌ట్లు వినిపిస్తోంది.

 

ఇదొక యూత్ పుల్ ఎంట‌ర్ టైన‌ర్ అని తెలుస్తోంది. క‌థ అంతా అనుష్క పాత్ర చుట్టూనే తిరుగుతుందిట‌. ఓ ర‌కంగా చెప్పాలంటే మ‌రో లేడీ ఓరియేంటెడ్ చిత్రంగా హైలైట్ అవుతుంది. మొత్తానికి అనుష్క మిగ‌తా ఇండ‌స్ట్రీల‌కు దూరంగా ఉన్నా?  మాలీవుడ్ లో మాత్రం బిజీ అయ్యే ప్ర‌య‌త్నాల్లో బిజీగా ఉంద‌ని తెలుస్తోంది. 

Anushka shetty signed her second mollywood project:

Anushka shetty second mollywood project On Track

Tags:   ANUSHKA SHETTY
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ