టాలీవుడ్ లో మ‌రో గెట్ టూ గేద‌ర్

Tollywood stars planning get togetherTollywood stars planning get together

 

సీనియ‌ర్ స్టార్ హీరోలు,  హీరోయిన్లు ఏడాదికోసారి గెట్ టూ గేద‌ర్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి, బాల‌య్య‌, నాగార్జున‌, వెంక‌టేష్ జ‌న‌రేష‌న్ హీరోలు, హీరోయిన్లు త‌ప్ప‌క మీట్ అవుతంటారు. ఈ స‌మావేశం చెన్నై లేదా?  హైద‌రా బాద్ లో జ‌రుగుతుంది. కొన్ని సంద‌ర్భాల్లో స్టార్స్ ఇళ్లే అందుకు వేదిక‌గా మారుతుంటాయి.

 

ఒక్కో ఏడాది ఒక్కో స్టార్ ఈ మీట్ కు కీల‌క బాధ్య‌త వ‌హిస్తుంటారు. ఇదంతా అందరిర‌కీ తెలిసిందే. అయితే ఆ త‌ర్వాత త‌రం న‌టులు మాత్రం ఎలాంటి గెట్ టూ గేద‌ర్ ఏర్పాటు చేసుకోవ‌డం లేదు. క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేస్తున్నారు త‌ప్ప  ఏడాది కోసారి మీట్ అయ్యే కార్య‌క్ర‌మం మాత్రం పెట్ట‌డం లేదు.

 

`మా ` డైరీ లాంచింగ్ స‌మ‌యంలోనో...సంతాప స‌భ‌ల్లోనో..లేదా? ఏదైనా వివాదం త‌లెత్తిన స‌మ‌యంలో స్టార్ల్ అంతా ఒకే ప్రేమ్ లో క‌నిపించడం త‌ప్ప వ్య‌క్తిగ‌తంగా ఎలాంటి మీట్ ఏర్పాటు చేసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది నుంచి వారు కూడా ఏటా గెట్ టూ గేద‌ర్ ఏర్పాటు చేసుకోవాల‌నుకుంటున్నారు.

 

దీనికి సంబంధించి  ఓ వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకున్నారుట‌. ఇంత‌కీ ఎవ‌రా స్టార్లు అంటే ప‌వ‌న్ క‌ళ్యాన్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్, ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్‌, గోపీచంద్, నాగ‌చైత‌న్య‌, విజయ్ దేవ‌ర‌కొండ‌, క‌ళ్యాన్ రామ్, అఖిల్ , రామ్ ఇలా వీరంతా ఆ గ్రూప్ లో ఉన్న‌ట్లు తెలిసింది. ఈ హీరోల్లో కొన్ని ఫ్యామిలీ లు అప్పుడప్పుడు పార్టీలంటూ క‌లుస్తుంటారు. రెస్టారెంట్స్..ఇళ్ల వ‌ద్ద మీట్ అవుతుంటారు.

Tollywood stars planning get together every year

tollywood stars planning get together