రెబల్ స్టార్ ప్రభాస్ 2026-27 లో నాలుగు సినిమాలో అలరించబోతున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ నటించిన `ది రాజాసాబ్` సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవడంలో విఫలమైంది. అయినా ఏం పర్లాదు. మరో ఆరు నెలల్లో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో భారీ వార్ అండ్ లవ్ స్టోరీ `ఫౌజీ` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయింది. మిగతా పనులు సహా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయితే 2026 లో డార్లింగ్ నుంచి రెండు రిలీజ్ లు పూర్తయినట్లే. అటుపై కొత్త ఏడాది 2027 లో కూడా రెండు రిలీజ్ లు ప్లాన్ చేస్తున్నాడు.
ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య `స్పిరిట్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. `యానిమల్` తర్వాత సందీప్ నుంచి రాబోతున్న చిత్రం కావడంతో? ఈ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ఇప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి. ఎన్నడు లేనిది సందీప్ ముందుగానే రిలీజ్ తేదీ కూడా ప్రకటించాడు. 2027 మార్చి 5న చిత్రాన్ని రిలీజ్ చేస్తామన్నారు.
అలాగే `కల్కీ` నుంచి పార్ట్ 2 షూటింగ్ మార్చి నుంచి మొదలు కానుందని సమాచారం. ఇప్పటికే సర్వం సిద్దం చేసి దర్శకుడు నాగ్ అశ్విన్ సిద్దంగా ఉన్నాడు. డార్లింగ్ సెట్స్ కు వెళ్లడమే ఆలస్యం మొదలు పెట్టాలని ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా 2027 జూన్ కల్లా పూర్తి చేయాలన్నది టార్గెట్. అదే జరిగితే దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తసుకు రావాలని నాగీ ప్లాన్ చేస్తున్నాడు. మొదటి భాగం షూటింగ్ కి పట్టినంత సమయం రెండవ భాగానికి పట్టదన్నది నాగీ కాన్పిడెన్స్.





2026 లో కొత్త భామలు కొట్టేనా
Loading..