Advertisementt

2026 లో కొత్త భామ‌లు కొట్టేనా

Wed 21st Jan 2026 11:37 AM
debutant actress  2026 లో కొత్త భామ‌లు కొట్టేనా
Debutant Actress Trying Luck In 2026 2026 లో కొత్త భామ‌లు కొట్టేనా
Advertisement
Ads by CJ

ఇండ‌స్ట్రీ నుంచి పాత నీరు పోవ‌డం..కొత్త నీరు రావ‌డం నిరంత‌రం జ‌రిగే ప్ర‌క్రియే. అందులోనూ హీరోయిన్ల విష‌యంలో ఈ స‌న్నివేశం ఎప్పుడూ క‌నిపిస్తూనే ఉంటుంది. తెలుగు న‌టీమ‌ణులు క్యూలో ఉన్నా?  వారంద‌ర్నీ ప‌క్క‌న బెట్టి ప‌రాయి భాష‌ల్ని తేచ్చే అన‌వాయితీ ఇప్ప‌టికీ కొన‌సాగుతుంది.  వాళ్ల‌ను మాత్రం టాలీవుడ్ భామ‌లు డామినేట్ చేయ‌లేక‌పోతున్నారు. ఈ ఏడాది కూడా చాలా మంది కొత్త భామ‌లు టాలీవుడ్ లో లాంచ్ అవుతున్నారు. ఓ సారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే..

 

దుల్కార్ స‌ల్మాన్ హీరోగా న‌టిస్తోన్న `ఆకాశంలో ఒక తార` చిత్రంతో తెలుగు న‌టి సాత్విక వీర‌వ‌ల్లి ప‌రిచ‌యం అవుతుంది. ప‌ద‌హార‌ణాల తెలుగు అమ్మాయి ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. ఇప్ప‌టికే రిలీజ్  అయిన పోస్ట‌ర్ల‌తో సాత్విక నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఈ సినిమా స‌క్సెస్ అయితే అమ్మ‌డికి మంచి అవాకాశాలు వ‌స్తాయి. అలాగే రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న `ఫౌజీ` చిత్రంతో ఇమ్మాన్వీ ఇస్మాయెల్ ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే.

 

పాకిస్తాన్ మూలాలున్న భామ ఇప్ప‌టికే నెట్టింట వైర‌ల్ అయింది. అమ్మ‌డు ఓ వీడియోతోనే మంచి డాన్స‌ర్ గా ప్రూవ్ చేసుకుంది. పాన్ ఇండియాలో ఈ సినిమా స‌క్సెస్ అయితే అవ‌కాశాలు క్యూ క‌డ‌తాయి. ఇంకా గుణ‌శేఖ‌ర్ స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తోన్న చిత్రం `యూఫోరియా`. ఇదొక‌  యూత్ ఫుల్ కాన్సెప్ట్ తో తెర‌కెక్కుతోంది. ఇందులో న‌లుగురైదుగురు న‌టీన‌టులున్నా?  బాలీవుడ్ న‌టి సారా అర్జున్ మాత్రం ప్ర‌త్యేకం.

 

ఈ సినిమా ఆమె మ‌పేరుతోనే మార్కెట్ లోకి వెళ్లాలి. ఇటీవ‌లే రిలీజ్ అయిన `ధురంధ‌ర్` సినిమాతో సారా అర్జున్ 1000 కోట్ల నాయిక‌గా మారింది.  దీంతో గుణ‌శేఖ‌ర్ అండ్ కో సారాని ప్ర‌త్యేకంగా ట్రీట్ చేస్తున్నారు. వీరితో పాటు మ‌రి కొంత మంది భామ‌లు వివిధ రాష్ట్రాల నుంచి టాలీవుడ్ లో లాంచ్ అవుతున్నారు.

Debutant Actress Trying Luck In 2026:

Will 2026 Bring Luck to Debutant Actress  

Tags:   DEBUTANT ACTRESS
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ