Advertisementt

రాజాసాబ్ - 3 రోజుల్లో 183 కోట్లు

Mon 12th Jan 2026 05:35 PM
the raja saab  రాజాసాబ్ - 3 రోజుల్లో 183 కోట్లు
TRS Heading Towards 200 Crores రాజాసాబ్ - 3 రోజుల్లో 183 కోట్లు
Advertisement
Ads by CJ

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ జర్నీ కంటిన్యూ చేస్తోంది. ఈ సినిమా 3 రోజుల్లో వరల్డ్ వైడ్ 183 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. రెండో రోజు మించిన కలెక్షన్స్ డే 3 దక్కించుకుందీ ప్రెస్టీజియస్ మూవీ. హారర్ ఫాంటసీ జానర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా రాజా సాబ్ నిలుస్తోంది.

అన్ని వర్గాల ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ అందించేలా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టర్ బ్యానర్ పై గ్లోబల్ సినిమా స్థాయిలో గ్రాండ్ గా మూవీని నిర్మించారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్.

 మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ తమ పర్ ఫార్మెన్స్ లు, అందంతో ఆకట్టుకున్నారు. సంక్రాంతి హాలీడేస్ సీజన్ లో ఫస్ట్ వీక్ రాజా సాబ్ హ్యూజ్ నెంబర్స్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.

TRS Heading Towards 200 Crores:

The Raja Saab Three Days Worldwide Boxoffice Collection

Tags:   THE RAJA SAAB
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ